NTV Telugu Site icon

TS SSC Exams: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఆ పేపర్‌ రాసేందుకు కేవలం 15 నిమిషాలే..

Ts Ssc Exams

Ts Ssc Exams

TS SSC Exams: తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్‌ 3 నుంచి ఏప్రిల్‌ 10 వరకు పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది నుంచి పదోతరగతి పరీక్షల్లో 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకు కుదించింది. అయితే 100 శాతం సిలబస్‌ తోనే పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. దీంతో పరీక్షలను సంబందించి పలు ముఖ్యమైన విసయాలను పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. పరీక్షలో భాగంగా విద్యార్థులకు ఇచ్చే మల్టీపుల్‌ చాయిస్‌ ప్రశ్నాపత్రం (బిట్‌ పేపర్‌)ను ఆఖరి 15 నిమిషాల్లోనే ఇవ్వాలని తెలిపింది. అంతేకాకుండా.. జనరల్ సైన్స్‌ పరీక్షలోని రెండు ప్రశ్నాపత్రాలను ఒకేసారిగా కాకుండా నిర్దశించిన సమయానికి విద్యార్థలకు విడివిడిగా ఇవ్వాలని తెలిపింది.

Read also: Great Love Story: టీనేజ్‌లో ప్రేమ.. 60 ఏళ్ల తరువాత పెళ్లి..

అయితే.. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లుగానే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా..ఇందులో జనరల్‌ సైన్స్‌ పరీక్షలో 40 మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉంటాయి..ఒకటి ఫిజికల్‌ సైన్స్‌ కాగా మరొకటి బయాలాజికల్‌ సైన్స్‌. ఇక.. జనరల్‌ సైన్స్‌లో తొలుత ఓ పేపర్‌ను ఇచ్చి దానికి సమాధానాలు రాసేందుకు 90 నిమిషాలు సమయం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇరభై నిమిషాల సమయం ఇచ్చి విద్యార్థులకు రెండో పేపర్‌ ఇవ్వాలని తెలిపారు. ఇక రెండో పేపర్‌ రాసేందుకు మరో 90 నిమిషాల సమయం కేటాయించాలని చెప్పారు.. మల్టీపుల్‌ చాయిస్‌ ప్రశ్నల పత్రాన్ని పరీక్ష చివరి 15 నిమిషాల ముందు ఇవ్వాలని సూచించారు. ఇక విద్యార్థులు ఆ పదిహేను నిమిషాల్లోనే అందులోని పది ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
KCR Tour: నేడు 4 జిల్లాల్లో కేసీఆర్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదీ