NTV Telugu Site icon

Bhoodan Land Scam: భూదాన్ భూముల స్కామ్‌.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు..

Marri Janardhan Reddy

Marri Janardhan Reddy

Bhoodan Land Scam: భూదాన్ భూముల స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నాగర్‌కర్నూలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆమోద డెవలపర్స్‌కి చెందిన సూర్య తేజతో పాటు కె.ఎస్.ఆర్ మైన్స్ కు చెందిన సిద్ధారెడ్డి ఈ స్కామ్ లో లాభ పడినట్లు ఈడీ గుర్తించింది. ఇస్కాన్ లో ఇప్పటికే ఐఏఎస్ అమోయ్ కుమారును పలుమార్లు విచారించింది. తాజాగా నలుగురికి నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 16న హాజరుకావాలని ఈడీ నోటీసులో పేర్కొంది.

Read also: Syrian Rebel Flag: భారత్లోని సిరియన్ ఎంబసీలో కొత్త తిరుగుబాటు జెండా ఆవిష్కరణ

మేడ్చల్ జిల్లాల్లో అమోయ్ కుమార్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో జరిగిన భూ లావాదేవీలపై బాధితులు ఈడీ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఈడీ ఇప్పటికే అమోయ్ కుమార్‌ను పలుమార్లు ప్రశ్నించింది. రూ.కోట్ల విలువైన 42 ఎకరాల భూమిని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఇతరులకు కేటాయించడంపై 5 రోజులుగా ప్రశ్నించారు. ఈ మేరకు అమోయ్ కుమార్, మహేశ్వరం తహశీల్దార్ వాంగ్మూలాలను నమోదు చేశారు. వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అప్పటి ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దార్ జ్యోతితోపాటు మరో నలుగురికి నోటీసులు జారీ చేశారు. వారు ఇచ్చిన కీలక పత్రాల ఆధారంగా రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి భూ ఆక్రమణలపై పూర్తి ఆధారాలను ఈడీ సేకరించి డీజీపీకి నివేదిక సమర్పించింది. ఇక తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
Uttam Kumar Reddy: నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పర్యటన..