తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. నాగర్‌కర్నూలు జిల్లాలోని అచ్చంపేట, అమ్రాబాద్, ఉప్పునుంతలలో భూమి స్వల్పంగా కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది. ఈ ఉదయం 5 గంటలకు భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అయితే, భూప్రకంపనలు స్వల్పంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం. భారీ వర్షాలు, వరదల కారణంగా భూమి పోరల్లోకి నీరు చేరడం వలన భూప్రకంపనలు వచ్చి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
Read: ‘క్రేజీ అంకుల్స్’ టైటిల్ సాంగ్: ఆకట్టుకున్న శ్రీముఖి అందాలు