Site icon NTV Telugu

Eagle Team : ఈగిల్ దాడులతో మత్తు ముఠాల కలకలం.!

Eagle

Eagle

Eagle Team : హైదరాబాద్‌లో ఈగల్ దంగల్ నడుస్తోంది. కొత్త రకం డ్రగ్స్‌తో సహా గంజాయి అమ్ముతున్న పెడ్లర్స్.. మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వారిని ఈగల్ టీమ్ ఛేజ్ చేసి మరీ పట్టుకుంటోంది. తాజాగా హఫీమ్ అనే డ్రగ్స్‌ను విక్రయిస్తున్న పెడ్లర్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఈగల్ అధికారులు. అలాగే హైదరాబాద్‌లో డ్రగ్స్ తీసుకుంటున్న 86 మందిని కటకటాల్లోకి నెట్టారు.

వాయిస్: మీలో సెక్స్ సామర్థ్యం తగ్గిందా..!! ఐతే మా డ్రగ్ వాడండి..!! ఈ డ్రగ్ అంటే మెడికల్ డ్రగ్ కాదు.. మత్తు మందు. అవును.. ఇలాగే చెప్పేసి అమ్మేస్తున్నారు కొంత మంది రాజస్థాన్‌కు చెందిన పెడ్లర్లు. ఈ గ్యాంగ్ మాటలు నమ్మి చాలా మంది యువకులు ఈ డ్రగ్‌కు అలవాటు పడుతున్నారు. ఓపీఎం అలియాస్ హఫీమ్ డ్రగ్ కోసం హైదరాబాద్‌లో యువకులు వెంపర్లాడుతున్నారు..

వాయిస్: యువతను డ్రగ్స్‌కు బానిసలుగా చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన ముగ్గుర్ని వ్యక్తుల్ని ఈగల్ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌కు చెందిన సావ్లారాం బిష్ణోయ్, గంగారాం అన్నదమ్ములు. వీరు 2008లో జీవనోపాధి కోసం హైదరాబాద్ కు వచ్చారు. స్టీల్ రెయిలింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. సావ్లారాం, గంగారాంకు దాదాపు 20 ఏళ్ల నుంచి హఫీమ్ అలియాస్ ఓపీయమ్ తాగే అలవాటు ఉంది. ఐతే హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత రాజస్థానీలను టార్గెట్ చేసుకుని ఈ ఇద్దరు అన్నదమ్ములు బిజినెస్ చేస్తున్నారు. గత 10 ఏళ్ల నుంచి హఫీమ్ మత్తు పదార్ధాలను అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నారు. 2019లో గంగారం బోయిన్ పల్లి పోలీసులకు హఫీమ్‌తో దొరికాడు. ఆ తర్వాత అతని పై నిఘా పెరగడంతో రాజస్థాన్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడు తన అన్నకు హఫీమ్ పంపిస్తూ దందా కొనసాగిస్తున్నాడు…

వాయిస్: సావ్లారాం తన బంధువులైన హపురాం బిష్ణోయ్, లాలారాం బిష్ణోయ్‌కి కమీషన్ ఆశ చూపి వారితో ఓపియంను హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. హాఫీమ్‌ను రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌‌కు తీసుకువచ్చేలా మాట్లాడుకుని విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు. ఈ ముగ్గురు బోయిన్‌పల్లిలో హఫీమ్ అమ్మడానికి వినియోగదారుల కోసం చూస్తుండగా ఈగిల్ పోలీసులు పట్టుకుంది. వారి వద్ద నుంచి 3.25 కిలోల ఓపియమ్ డ్రగ్ పట్టుకున్నారు. 45 రోజుల కింద అందిన ఓ చిన్న లీడ్ తో ఈ ముగ్గుర్ని నీడలా వెంటాడిన ఈగిల్ టీమ్.. హఫీమ్ ఎలా తీసుకువస్తున్నారనే రూట్ ను ఫాలో అయ్యింది. ఆదిలాబాద్‌లో ఓ ఇంట్లో దాచి పెట్టిన ఈ హఫీమ్ మత్తు పదార్ధాన్ని కారులో తీసుకు వస్తుండగా ఈగిల్ అధికారులు అరెస్ట్ చేశారు…

మరోవైపు హైదరాబాద్‌లో విచ్చలవిడిగా సాగుతున్న గంజాయి దందాకు చెక్ పెట్టారు ఈగల్ పోలీసులు. జస్ట్ 2 గంటల్లోనే డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి 86 మందిని పట్టుకున్నారు. మార్కెటింగ్ ఉద్యోగులు, హెచ్‌ఆర్‌ మేనేజర్లు ఈగల్‌ టీమ్‌కు చిక్కిన వారిలో ఉన్నారు. ‘బాయ్‌ బచ్చా ఆగయా’ అంటూ ఓ వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్ చేసి గంజాయి లావాదేవీలు చేస్తున్నట్లుగా గుర్తించారు.

తెలంగాణను డ్రగ్ రహిత రాష్ట్రంగా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఈగల్ టీమ్.. రాష్ట్ర పరిధిలో స్పెషల్‌ ఆపరేషన్లకే పరిమితం కాకుండా.. డ్రగ్స్‌ సరఫరా అవుతున్న ప్రాంతాల్లోనూ డెకాయి ఆపరేషన్లు నిర్వహిస్తోంది. అలాగే మాటు వేసి మత్తు ముఠాల గుట్టు కనిపెట్టడంలోనూ ఈగల్‌ బృందాలు విజయవంతమవుతున్నాయి. ఇటీవల ఇదే తరహాలో గోవా పబ్బుల్లో డీజేలుగా పనిచేస్తూ.. హైదరాబాద్‌కు కొకైన్‌ సప్లయ్‌ చేస్తున్న డీజే వనిష్‌ టక్కర్, సప్లయర్‌ బాలకృష్ణను అరెస్ట్‌ చేశారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్న డ్రగ్స్‌ సప్లయర్ల కాంటాక్ట్స్, కస్టమర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా.. అధికారులు గోవాలో ఇటీవలే సోదాలు నిర్వహించారు…

గోవాలో దాదాపు 50 మంది నైజీరియన్లు పనిచేస్తున్నట్టు పక్కా సమాచారం సేకరించిన తర్వాత.. డ్రగ్స్‌ కింగ్‌పిన్‌గా భావిస్తున్న మ్యాక్స్‌ నెట్‌వర్క్‌లోని హవాలా వ్యాపారులు ఉత్తమ్‌ సింగ్, రాజు సింగ్, మహేందర్‌ ప్రజాపతిలను అరెస్ట్‌ చేసి ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. వీరి నుంచి 49.65 లక్షలు సీజ్‌ చేశారు. ఈ క్రమంలోనే ఓ నైజీరియన్‌ను అరెస్ట్‌ చేసి 1.64 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు. ఇలా అంతర్రాష్ట్ర ఆపరేషన్లలోనూ దూకుడుగా వెళ్తున్నారు…

Exit mobile version