Site icon NTV Telugu

Dasara : మాంసం ప్రియులకు బిగ్ ఆప్డేట్..!

Mutton Shops

Mutton Shops

Dasara: నిజంగా ఇది ఊహించని ట్విస్ట్..! ప్రతి దసరా పండుగ వచ్చిందంటే చాలు.. నాన్-వెజ్ బిజినెస్ ఆకాశాన్ని తాకుతుంది. సాధారణంగా 10 టన్నుల మటన్, చికెన్ అమ్ముడైతే.. దసరా రోజున ఏకంగా 20 టన్నుల పైనే సేల్స్ అవుతాయని ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. అలాంటి పీక్ డే రోజునే.. GHMC కమిషనర్ ఆదేశాల మేరకు మటన్, చికెన్ విక్రయాలు ఎక్కడా జరగకూడదని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు.

GST వసూళ్లలో సంచలనం.. ఒక్క సెప్టెంబర్‌లోనే ఎన్ని లక్షల కోట్లంటే..?

దీనికి ప్రధాన కారణం.. గాంధీ జయంతి నిబంధనలు! జాతీయ సెలవుదినం, పవిత్రమైన రోజు కాబట్టి మాంసం విక్రయాలు జరపకూడదు. ఈ నిబంధనను ఎట్టి పరిస్థితిలోనూ పాటించాలి అని మున్సిపల్ అధికారులు షాప్ ఓనర్లకు అవేర్‌నెస్ కల్పిస్తున్నారు. కేవలం హెచ్చరికలు మాత్రమే కాదు, సీరియస్ కన్సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి. రేపు ఎవరైనా షాప్ తెరిస్తే, జరిమానా విధించడమే కాకుండా, తక్షణమే షాప్‌ను సీజ్ చేస్తామని అధికారులు వార్నింగ్ ఇచ్చారు.

అయితే, మాంసం షాపుల ఓనర్లు కూడా ఈ రూల్స్‌కు కో-ఆపరేట్ చేస్తూనే, తమ బిజినెస్ ప్లాన్‌ను మార్చుకున్నారు. నిబంధనలు పాటించాలి కాబట్టి.. ఈ రోజు (దసరాకు ముందు రోజు) సాయంత్రానికే, రాత్రి వరకు కూడా మాంసం అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ రోజు నైట్ టైమ్‌లోనే బిగ్ బిజినెస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

మరోవైపు, కాలనీ వాసులు, సామాన్య జనం.. దసరా అంటే మాంసం లేకుండా గడవని రోజు కాబట్టి, వారు కూడా ఈ రోజు సాయంత్రానికే ముందస్తు కొనుగోళ్లు (అడ్వాన్స్ పర్చేసెస్) చేసి, తమ ఇళ్ల వద్దే పండగ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కావలసిన ఏర్పాట్లలో మునిగి తేలుతున్నారు. మొత్తానికి, మున్సిపల్ అధికారుల ప్రెషర్ ఒక వైపు ఉన్నా.. సామాన్య జనం తమ పండగ ఎంజాయ్‌మెంట్‌ను ఆపుకోలేక, ముందస్తుగా సర్దుబాటు చేసుకుంటున్నారు.

Raviteja: అక్టోబర్ 31న మాస్ జాతర

Exit mobile version