Drugs Tests: డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్స్ టెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది. పబ్ లలో డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఖరీదైన డ్రగ్స్ నగరంలో ఎక్కడబడితే అక్కడ దొరుకుతున్నాయి. బంజారా హిల్స్ రాడిసన్ హోటల్ లోని ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ దొరికిన వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ డ్రగ్స్ పై ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ ని అరికట్టేందుకు పటిష్టమయిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరే డ్రగ్ టెస్ట్‌లు చేయాలని నిర్ణయించింది.
నోట్లోని లాలాజలంతో టెస్ట్ నిర్వహిస్తారు. దీని ద్వారా రెండునిమిషాల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. పాజిటివ్ వస్తే మూత్రం, రక్త పరీక్షలతో నిర్ధారణకు వస్తారు. కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో వినియోగిస్తున్న ఈ తరహా విధానాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. డ్రగ్ టెస్ట్‌లు నిర్వహణకు హైదరాబాద్ పోలీసులు కసరత్తు ప్రారంభించారని తెలుస్తోంది.
Also Read
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
Also Read: Pudding and Mink Pub: ముగిసిన తొలిరోజు ఆ ఇద్దరి కస్టడీ విచారణ
డ్రంక్ అండ్ డ్రైవ్ లో బ్రీత్ అనలైజర్లు ఉపయోగించడం తెలిసిందే. అదే తరహాలో డ్రగ్స్ వినియోగదారులను గుర్తించేందుకు డ్రగ్ అనలైజర్లు వినియోగించనున్నారు. డ్రగ్ అనలైజర్లతో పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాలను అధ్యయనం చేయనుంది హైదరాబాద్ పోలీస్ శాఖ. డ్రగ్ తీసుకుంటే ఎరుపు రంగులో, లేకపోతే ఆకుపచ్చ రంగులో చుక్కలు వస్తాయి. ఈ డ్రగ్ అనలైజర్ పరీక్షలోపాజిటివ్ వస్తే మూత్రం, రక్త పరీక్షలు నిర్వహించి ఒక నిర్దారణకు వస్తారు. గంజాయి, హాష్ ఆయిల్, కొకైన్, హెరాయిన్ లను గుర్తించనున్నాయి డ్రగ్ అనలైజర్లు. కీలకమయిన ప్రాంతాల్లో డ్రగ్ పరీక్షలు చేయనున్నారు లా అండ్ ఆర్డర్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు. ఈ పరీక్షల ద్వారా డ్రగ్ వినియోగదారుల ఆటకట్టించవచ్చని అంటున్నారు.

Drugs Test Kit
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!