హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 10 లో నివాసంపై ఇవాళ ఎక్సైజ్ పోలీసుల దాడి చేశారు. ఈ సందర్భంగా డ్రగ్స్ ముఠాలోని ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు… వీరి వద్ద నుండి పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 17 గ్రాముల కొకైన్ తో పాటు, 8 గ్రాముల ఎండిఎంఏ, 73 ఎస్టకి పిల్స్, 15 గ్రాముల చరాస్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
read also : ఆరోపణలు ఎదుర్కోలేకే GHMC మొదటి సమావేశం వర్చ్యువల్ గా పెట్టారా?
ఈజ అనే నైజీరియన్ నుండి డ్రగ్స్ అబ్దుర బాబు, సొలమన్ ఇద్దరు నిందితులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరు, ముంబై నుండి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాదులో ఈ యువకులు అమ్ముతున్నట్లు కూపీ లాగారు పోలీసులు. ఒక్క గ్రామ్ కొకైన్ ను ఏకంగా రూ. 8000లకు అమ్ముతున్నారని గుర్తించారు. ఇంకా ఈ కేసుపై వివరాలు తెలియాల్సి ఉంది.
