హైదరాబాద్ లో సంచలనం కలిగించిన డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో వైశాలి కిడ్నాప్ కి నవీన్ రెడ్డి వాడిన వోల్వో కార్ లభ్యమయింది. కార్ వుంది కానీ నవీన్ రెడ్డి ఎక్కడ ఉన్నది ఆచూకీ తెలియలేదు. ఈ కారు నెంబర్ TS 07 HX 2111, నవీన్ రెడ్డి, S/O కోటి రెడ్డి 8-7-93-NE/95 HASTINAPUR HYDERABAD పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఈకారులో వైశాలిని కిడ్నాప్ చేశాడు నవీన్ రెడ్డి. ఆ తర్వాత ఈ కార్లో తిరిగితే దొరికిపోయే అవకాశాలు ఉన్నాయని… శంషాబాద్ తొండుపల్లి వద్ద కారును వదిలేసి వెళ్లిపోయాడు నవీన్ రెడ్డి.
Read Also: Degree Exams: 800 మార్కులకు 5,360.. అవాక్కవుతున్న విద్యార్థులు
ఇదే కార్లో గతం లో వైశాల్ ఇంటి వద్ద హంగామా చేస్తూ ఫోటోలు దిగుతూ హడావిడి సృష్టించిన నవీన్ రెడ్డి. వోల్వో కారు డోర్స్ ఓపెన్ కావడంలేదు. డోర్స్ ఓపెన్ చేయటానికి కంపెనీ ప్రతినిధులను రప్పిస్తున్నారు పోలీస్ లు..ఉన్నతాధికారుల సమక్షంలో లో కార్ డోర్స్ ఓపెన్ చేయనున్నారు పోలీస్ లు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పరిధిలో సంచలనం సృష్టించిన మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో నిందితుడైన నవీన్ రెడ్డి పై గతంలో వరంగల్ లోనూ కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది.
ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ చీటింగ్ చేశాడని 2019లో ఇంతేజార్ గంజ్ పీఎస్లో బాధితుల ఫిర్యాదు కేసులో అరెస్ట్ అయ్యాడు నవీన్ రెడ్డి. హైదరాబాద్ కేంద్రంగా విజయాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా ఆన్లైన్ వెబ్సైట్ మోసాలకు పాల్పడ్డాడు. 2019లో ఇంతేజార్ గంజ్ ఠాణా పరిధిలో ఐపీసీ 420 సెక్షన్తోపాటు ఐటీ యాక్ట్ 66 (డీ) కింద కేసు నమోదు అయి వుంది. నవీన్ రెడ్డి ఆచూకీ తెలిస్తే అనేక విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు. మరోవైపు నవీన్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
Read Also: Degree Exams: 800 మార్కులకు 5,360.. అవాక్కవుతున్న విద్యార్థులు