Site icon NTV Telugu

Dost 2025 : తెలంగాణ డిగ్రీ ప్రవేశాల్లో నిరాశ.. 32 శాతం సీట్లు మాత్రమే భర్తీ

Dost 2024

Dost 2024

Dost 2025 : తెలంగాణలో డిగ్రీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ) కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే, ఈ ఏడాది డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీ ఆశించిన స్థాయిలో జరగలేదు. రాష్ట్రంలోని మొత్తం 957 డిగ్రీ కళాశాలల్లో ఉన్న 4,36,947 సీట్లకు గాను, కేవలం 1,41,590 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇది మొత్తం సీట్లలో కేవలం 32 శాతమే కావడం గమనార్హం.

Wiaan Mulder: అందుకే బ్రియాన్ లారా రికార్డ్ ను వదిలేశా.. వియాన్ ముల్డర్ సంచలన వ్యాఖ్యలు..!

ఈ పరిణామం డిగ్రీ విద్య పట్ల విద్యార్థుల ఆసక్తి తగ్గిందా, లేక ప్రవేశ ప్రక్రియలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది. వేలాది సీట్లు ఖాళీగా మిగిలిపోవడంతో, ఉన్నత విద్యా మండలి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి , ఎక్కువ మంది విద్యార్థులకు డిగ్రీ విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి, త్వరలో ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ ప్రత్యేక రౌండ్ ద్వారా మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ ఉన్నత విద్యా కలలను సాకారం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్ తేదీలు , ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

Gender Reveal Test: వీడు డాక్టర్ కాదు కంత్రీగాడు.. అర్థరాత్రి 2 గంటలకు హాస్పిటల్లో అబార్షన్లు!

Exit mobile version