Dogs Attacked: రంగారెడ్డి జిల్లాలో పిచ్చికుక్కల స్వైర విహారం రోజు రోజుకూ ఎక్కువగా మారుతుంది. మంచాల మండలంలో చిన్నపిల్లలపై, మహిళలపై విచక్షణా రహితంగా కుక్కలు దాడి చేస్తున్నాయి. ఉదయం నడుకుంటూ పోతున్న ఓ మహిళ, ఓ బాలుడి పై దాడి చేసి వారిపై కండలు పీక్కుతిన్నాయి. వారిద్దరూ గట్టిగా కేకలు వేయడంతో అక్కడకు స్థానికులు చేరుకుని కుక్కను తరుముతున్న కుక్కలు దాడి మాత్రం ఆపలేదు. ఓ బాలుడి చేతికి, మహిళలకు కాళ్ల కండరాలను దారుణంగా కర్చాయి. స్థానికులు గుంపుగా కూడి కుక్కలను తరమడంతో అక్కడి నుంచి పరారయ్యాయి. అయితే ఇలాంటి కుక్కలపై మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించకపోతే ఇలాంటి ఘటనలు ఇంకా ఎక్కువగా చూడాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందింది మనషులపై దాడి చేస్తున్న కుక్కలను మున్షిపల్ అధికారులు పట్టుకోవాలని వేడుకుంటున్నారు.
Read also: Daniel Balaji : చనిపోతూ ఇద్దరి జీవితాల్లో వెలుగునింపిన నటుడు.. ఎంత గొప్ప మనసు నీది..
తాజాగా.. వీధికుక్కల దాడిలో 18 నెలల చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని ఏని అడ్రసపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కరుణాకర్ కుమార్తె రష్మిత ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా వీధికుక్కలు దాడి చేశాయి. శిశువును చుట్టుముట్టి ముఖంతో పాటు శరీరంలోని ఇతర భాగాలపై కరడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు కుక్కలను చెదరగొట్టారు. చిన్నారిని చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Miracle : ఒకరినొకరు 22 రోజుల తేడాతో పుట్టారు.. మరి వీళ్లను కవలలు అంటారా ?