NTV Telugu Site icon

Dog attack on deer: చంపేస్తున్నాయ్.. మనుషులనే కాదు జింకలను వదలని కుక్కలు

Dog Attack On Deer In Vikarabad

Dog Attack On Deer In Vikarabad

Dog attack on deer: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. జిల్లాల వారిగా..కుక్క కాటు బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. దాదాపు 3 నెలలుగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇంటి నుంచి బయటకెళ్లాలంటేనే భయపడుతున్నారు. అప్పటి వరకు బాగానే ఉంటున్న వీధి శునకాలు.. ఉన్నట్టుండి ఒక్కసారిగా దాడులకు పాల్పడుతున్నాయి. చిన్నారులు, పెద్దలపై దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. అయితే.. ఇప్పుడు మనుషులపై దాడిచేస్తున్న వీధికుక్కలు మూగ జీవాలపై దాడిగి దిగుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలో కుక్కల దాడిలో కృష్ణ జింక మృతి చెందింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

వికారాబాద్ జిల్లా పెదముల్ మండలం హన్మాపూర్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పొలంలో కృష్ణ జింకలను కుక్కలు వెంబడించాయి. వాటి బారి నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తిన జింక పొలంలో ఫినిషింగ్ వైర్‌కు తగిలి తీవ్రంగా గాయపడింది. లేవలేని స్థితిలో ఉన్న జింకపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి చంపాయి. కుక్కల ఎగబడి తన ప్రాణాలు తీస్తున్న పాపం జింక లేవలేని పరిస్థితిలో నిస్సహాయం ఉండిపోయింది. జింకను చంపి పీక్కుతిన్నాయి. ఈఘటన చూసిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు వైద్యుల సమక్షంలో జింకను పూడ్చిపెట్టారు. వీధికుక్కలతో భయభ్రాంతులకు గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. కుక్కలను బంధించాలని కోరుతున్నారు. పొలం పనితో ఇంటి దగ్గర చిన్నారులను వదిలి వస్తామని ఇంటి దగ్గర వీధికుక్కలు ఉంటున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఏ సమయంలో చిన్నారులపై, మనషులపై వీధికుక్కలు దాడి చేస్తాయో అనే భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కలను బంధించాలని కోరుతున్నారు.

Read also: Rajasthan Royals : చాహల్ తో కలిసి డ్యాన్స్ చేసిన జో రూట్

తాజాగా వనపర్తి జిల్లా పానగల్ మండలం జమ్మిపూర్ గ్రామానికి చెందిన అన్న రమేష్ అనే గొర్రెల యజమాని 15 రోజుల క్రితం గొర్రె పిల్లలను మేపుతూ మండలానికి చేరుకున్నాడు. వట్టిపల్లి గ్రామ శివారులో తాత్కాలికంగా కంచె వేసి గొర్రె పిల్లలను గొయ్యిలో ఉంచారు. నిద్రిస్తున్న సమయంలో కుక్కలు దాడి చేయడంతో రూ.3 లక్షల విలువైన 48 గొర్రె పిల్లలు మృతి చెందాయి. మరో మూడింటికి తీవ్రంగా గాయపడ్డాయి. మేత కోసం ఇక్కడికి వచ్చామని, కుక్కలు దాడి చేయడంతో 48 గొర్రె పిల్లలు చనిపోయాయని బాధితుడు రమేష్ వాపోయాడు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని బాధితుడు కోరారు.
Pink Moon: ఈ పౌర్ణమిని “పింక్ మూన్”గా ఎందుకు పిలుస్తారో తెలుసా..?