K.A.Paul: మొయినాబాద్ ఫాంహౌస్ వ్యహారం పొలిటికల్ హీట్ రాజేస్తుంది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో ముగ్గరు నిందితుల అరెస్ట్ చేశారు పోలీసులు. మొయినాబాద్ ఫాంహౌస్ లో పోలీసులు తనిఖీలు చేశారు. అయితే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు కుట్ర పన్నిందని వస్తున్న వార్తలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. బీజేపీకి, టీఆర్‌ఎస్ కు ఓటు వేయొద్దని ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. బీజేపీ, టీఆర్‌ఎస్ కుట్రలు బయట పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ మిత్రులారా మీరు కూడా ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కే.ఏ.పాల్ సంచళన వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని మోడీ నుంచి, రాష్ట్రాన్ని కేసీఆర్ నుంచి కాపాడుకుందామని, మునుగోడు ప్రజలు ఇప్పటికైనా గుర్తించాలని కోరారు.
Read also: Elon Musk: ఎలాన్ మస్క్ ఇక ట్విట్టర్ చీఫ్..! ఆఫీసులోకి ఇలా ఎంట్రీ ఇచ్చాడేంటి..
కొనుగోలు చేసేందుకు మధ్యవర్తుల్లా వ్యవహరించింది రఘునందన్ రావు, కిషన్ రెడ్డి నే అంటూ ఆరోపించారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు వందకోట్లు ఇచ్చి బీజేపీ వాళ్లు కొంటారని నేను ముందే చెప్పానని అన్నారు. మహారాష్ట్రలో చేసిందే చేస్తున్నారని అన్నారు. బీజేపీ మునుగోడు ఓట్లును ఎలా కొంటున్నారో టీఆర్‌ఎస్ కూడా వేలకోట్లు ఖర్చుపెట్టి కొంటున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ కు ఓటు వేయకండి, బీజేపీకీ ఓటు వేయకండి ఉంగరం గుర్తుకు ఓటు వేయడండి అంటూ కే.ఏ.పాల్ కోరారు. మునుగోడులో బీజేపీ, టీఆర్‌ఎస్‌ను చిత్తుగా ఓడించాలని అన్నారు. కాంగ్రెస్ మిత్రులారా అందరూ నాకే ఓటువేయాలని కోరుతున్నారు. నిన్న మొయినాబాద్ లో జరిగిన ఘటన కెసిఆర్ డ్రామా చేస్తున్నారని అన్నారు. బీజేపీ పార్టీ ప్రజా ప్రతినిధులను పశువులను కొంటున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో ఇటువంటి ఘటనలు వెలుగు చూసాయని అన్నారు. అంబేద్కర్, పూలే, కన్షిరామ్ పూర్తిగా ప్రజాశాంతి పార్టీ పనిచేస్తుందని అన్నారు. బీజేపీ , టీఆర్ఎస్ లను ఒడించండని మునుగోడు ప్రజలను కోరారు. బీజేపీ, టీఆర్ఎస్ కులసమ్మెలనాను పెట్టడం బాధాకరమని అన్నారు.