NTV Telugu Site icon

DK Aruna: వంశీ చంద్ రెడ్డికి అది అలవాటే.. రాముడిపై ప్రమాణానికి నేను రెడీ

Dk Aruna

Dk Aruna

DK Aruna: కాంగ్రెస్ ఎఐసిసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి సవాలును డికె అరుణ స్వీకరించారు. నిన్న జరిగిన కాంగ్రెస్ సమావేశంలో డికెఅరుణ పై వంశీ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ గా పోటీచేయడానికి డికె అరుణ 15 కోట్లు డిమాండ్ చేసిందని వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. డికె అరుణ శ్రీరాముడిపై ప్రమాణం చేసి నిజం నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. డికె అరుణ రాముడి పై ప్రమాణం చేస్తే తను రాజకీయ సన్యాసం చేస్తానన్న వంశీ చంద్ రెడ్డి చెప్పడంతో వైరల్ గా మారింది. వంశీ చందర్ రెడ్డి సవాలును డీకే అరుణ స్వీకరించారు.

రాముడిపై ప్రమాణానానికి తాను సిద్దమేనన్న డికెఅరుణ ప్రకటించారు. వంశీచంద్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడని మండి పడ్డారు. తాను జిల్లాలో ఎవరూ గుర్తు పట్టడంలేదని అన్నారు. డి కె అరుణ గూర్చి మాట్లాడితే తనకు గుర్తింపు వస్తుందని వంశీ చంద్ రెడ్డి ఆరాటమన్నారు. సమయం, స్థలం మీరు చెప్పినా సరే లేదంటే నేనే టైం డేట్ ఫిక్స్ చేస్తా అంటూ డికే అరుణ తెలిపారు. నీతో పాటు ఎవరెవరిని తీసుకువస్తావో రా అని సవాల్ చేశారు. తనకు మొదటి నుండి రాజకీయ సన్యాసం అలవాటే అంటూ సెటైర్ వేశారు. నీతో పాటు నీవు చెప్పిన వారిని కూడా రాజకీయ సన్యాసానికి సిద్దం చేయి అంటూ డికె అరుణ అన్నారు.

Read also: Madras High Court Judge: నాకు హింది రాదు.. వాటిని అలాగే పిలుస్తాను..

డీకే అరుణ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు టీపీసీసీ నేతల సమక్షంలో రూ. 15 కోట్లు ఇస్తే కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమన్నది నిజం కాదని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి అన్నారు. రాముడి పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆమె అన్నారు. మహబూబ్ నగర్ లోని ఓ ప్రైవేట్ వేదికగా నియోజకవర్గ కార్యకర్తల భారీ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న వంశీచందర్‌రెడ్డి మాట్లాడుతూ గత లోక్‌సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇతర నాయకులు పార్టీని వీడి ప్రతికూల పరిస్థితుల్లో పోటీ చేశారన్నారు. కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేశారని, వారి పనితీరును స్వయంగా చూశానన్నారు. ఇక్కడి ఎంపీతో పాటు రాష్ట్రంలో ఎక్కువ మంది ఎంపీలను గెలిపించి రాహుల్ గాంధీ ప్రధాని కావడంలో కీలకపాత్ర పోషించాలన్నారు.