Site icon NTV Telugu

పోలీసులు.. కేసీఆర్ తొత్తులుగా మారిపోయారు : డీకే అరుణ‌

తెలంగాణ పోలీసులు.. కేసీఆర్ తొత్తులుగా మారిపోయారంటూ డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఎన్నికల హామిగా రెండు పడక గదుల ఇల్లు నిర్మిస్తామని టీఆర్ ఎస్‌ చెప్పిందని.. గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు పడక గదుల ఇల్లు ఇస్తామని చెప్పి ఇవ్వని దుస్థితి నెల‌కొంద‌ని.. గత ప్రభుత్వం సేకరించిన 78 ఎకరాల భూమిలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని తెలిపారు. కేవలం 5వందల ఇల్లు మాత్రమే నిర్మించారు తప్పితే.. లబ్ధిదారులకు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.

https://ntvtelugu.com/night-curfew-in-uttar-pradesh/

గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు చెల్లవని తెరాస ప్రభుత్వం చెబుతోందని… నర్సింగ్ కాలేజ్, ఆసుపత్రి కాలేజ్ పేరుతో బలహీన వర్గాల భూమిని ప్రభుత్వం గుంజుకుంటుందని మండిప‌డ్డారు. నర్సింగ్ కాలేజ్ పేరుతో పేదల భూములు గుంజుకుంటారా అని నిల‌దీశారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎకరం భూమి సేకరించే దమ్ము లేదా అనిప్ర‌శ్నించారు. ఏ ముఖం పెట్టుకుని పేదల భూమిలో నర్సింగ్ కాలేజ్ కి శంకుస్థాపన చేస్తార‌ని నిల‌దీశారు. ప్రభుత్వం సక్రమమైన పని చేసినప్పుడు వందల మంది పోలీసులతో బందోబస్తు ఎందుకు? అని నిల‌దీశారు. 78 వేల ఎకరాల్లో 10వేల మందికి ఇల్లు కట్టించి ఇవ్వవచ్చని పేర్కొన్నారు డీకే అరుణ. బడుగు బలహీన వర్గాల మీద కేసీఆర్, హరీష్ రావు కు చిత్తశుద్ధి లేదని మండిప‌డ్డారు.

Exit mobile version