Site icon NTV Telugu

సీఎం కేసీఆర్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌పై డీకే అరుణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాల పర్యటన చేస్తే చావు డప్పు కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ లో పత్రిక ప్రకటన విడుదల చేశారు డీకే అరుణ. ఈ నెల 20 వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా చావు డప్పులు కొట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునివ్వడం పై డీకే అరుణ నిప్పులు చెరిగారు.

https://ntvtelugu.com/minister-ktr-public-letter-to-the-central-government-over-texitles/

వడ్లు కొంటామ‌ని ఒక్కసారి, కొనమని చెప్తూ తెలంగాణ రైతాంగాన్ని మభ్య పెడుతున్నాడ‌ని ఫైర్ అయ్యారు. వడ్లు కొంటామని ముందు నుంచి చెప్తున్న బీజేపీ పై బురద చల్లే ప్రయత్నం కెసిఆర్ చేస్తున్నారని డీకే అరుణ విమర్శించారు. కేంద్రం వడ్లు కొంటామని చెప్తునప్పటికీ… ఇంత వరకు వడ్లను సేకరించకుండా కాలయాపన చేస్తూ, రైతుల ఆత్మ హత్యలకు కారణమ‌వుతున్నార‌ని డీకే అరుణ ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ ముఖ్యమంత్రికి లేకపోగా, ప్రజల దృష్టి మళ్లించేందుకు తీవ్రంగా ప్రయతనిస్తున్నారని డీకే అరుణ అన్నారు.

Exit mobile version