NTV Telugu Site icon

Double Bedroom: లక్ష డబుల్ బెడ్‌ రూం ఇళ్ల పంపిణీ.. ఈనెల 15 నుంచి ప్రారంభం

Double Bedroom

Double Bedroom

Double Bedroom: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల అమలులో స్పీడ్ పెంచింది. ప్రజలకు మేలు చేకూర్చేలా వివిధ పథకాలతో ప్రజలకు చేరువ కావడం హ్యాట్రిక్ విజయమన్నారు. గత రెండు నెలల్లోనే రెండో విడత గొర్రెల పంపిణీ, పోడు పట్టాల పంపిణీ, దళిత బంధు, బీసీ రూ. లక్ష ఆర్థిక సహాయం, రైతు బంధువులు, మైనార్టీలకు రూ. లక్ష సాయం ప్రకటించారు. నేటి నుంచి రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. తాజాగా మంత్రి కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్‌లోని పేదలకు శుభవార్త అందించారు. గ్రేటర్ పరిధిలో నిర్మించిన లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి 4 వేల చొప్పున గ్రేటర్ పరిధిలోని పేదలకు రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు.

Read also: WOLF Teaser: ప్రభుదేవా పాన్ ఇండియ‌న్ మూవీ ‘వూల్ఫ్’ టీజర్ వచ్చేసింది.. సరికొత్తగా అన‌సూయ‌!

ఎల్ బీ నగర్ నియోజకవర్గంలోని 37 కాలనీలు ఎన్నో ఏళ్లుగా భూసమస్యలతో సతమతమవుతుండగా.. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన 118 జీవో ప్రకారం బుధవారం నియోజకవర్గంలో 18 వేల కుటుంబాలకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్ ఈ నెల 15 నుంచి డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ చేపడతామన్నారు. రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గంలోని ప్రతి 3 వేల కుటుంబాలకు గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలు అందజేస్తామన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్నదే సీఎం కేసీఆర్ కల అని అన్నారు. ఆయన సంకల్పంతో ఐదేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందుతుందన్నారు.

Read also: Indian 2 : ఇండియన్ 2 సినిమా షూటింగ్ పై అసహనం వ్యక్తం చేస్తున్న అభిమానులు..

వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు. మూసీ నదిపై దుర్గం చెరువు తీగల వంతెన తరహాలో 14 ఆకర్షణీయమైన వంతెనలను నిర్మిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఎల్‌బీనగర్‌ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు ఓఆర్‌ఆర్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో మొత్తం 415 కిలోమీటర్ల మేర మెట్రోను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ తన సమర్థ పాలనతో రాష్ట్రాన్ని జాతీయ తలసరి ఆదాయంలో అగ్రగామిగా నిలిపారన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ విజయాన్ని అందించాలన్నారు. ఎన్నికలకు ఆరు నెలల సమయం కేటాయించి మిగిలిన నాలుగున్నరేళ్లలో అభివృద్ధికి కృషి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Girlfriend Birthday: బర్త్‌డే కోసం ప్రియురాలి ఇంటికెళ్లాడు.. తీరా కిచెన్ రూంలో చూస్తే ఊహించని షాక్

Show comments