Double Bedroom House: డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ముహూర్తు ఫిక్స్ చేశారు అధికారులు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో సెప్టెంబర్ 2 నుంచి రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీపై ఆగస్టు 19 (శనివారం) అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అర్హులైన పేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, సుందరీకరణ, పంపిణీకి చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. మొదటి దశలో 8 ప్రాంతాల్లో 12000 మందికి ఇళ్లను పంపిణీ చేయబోతున్నామని మంత్రి తెలిపారు. అర్హులైన అభ్యర్థులను గుర్తించి లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఆగస్టు 24న హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో డ్రా వేయనున్నట్లు తలసాని తెలిపారు.
Read also: Rajiler: జైలర్ కలెక్షన్స్ లో డ్రాప్… రజినీ కాళ్లు మొక్కడమే కారణమా?
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలు ఎంతో ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణలోనే ప్రభుత్వం సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తోందని తలసాని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిరుపేదలకు, ఇళ్లులేని వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పిన సంగతి తెలిసిందే. జంటనగరాల్లో ఇప్పటికే 4,500 మంది లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లను అందించారు. మరో 70 వేల ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. మురికివాడల్లో నివసిస్తున్న పేదల గుడిసెలను తొలగించి డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అనంతరం ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు. జీహెచ్‌ఎంసీలో సిబ్బంది కొద్దిరోజులుగా వెరిఫికేషన్ ప్రక్రియ చేస్తున్నారు. వెరిఫికేషన్ అనంతరం అర్హులైన అభ్యర్థుల పేర్లతో లాటరీ తీసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
Telangana Govt: ఖాతాలు స్తంభించిన నో ఫికర్.. లక్షలోపు రుణమాఫీ పక్కా చేస్తాం..