NTV Telugu Site icon

Disha Encounter: దిశ ఎన్ కౌంటర్ ఫేక్… తేల్చిన సిర్పూర్కర్ కమిషన్

Disha1

Disha1

దేశవ్యాప్తంగా సంచలన రేపిన దిశ ఎన్ కౌంటర్ కేసులో పోలీసులు కట్టుకథలు చెప్పారని.. ఎన్ కౌంటర్ బూటకం అని సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. చట్టపరమైన నిబంధనలను, పోలీస్ మాన్యువల్ రూల్స్ ను అతిక్రమించారని తెలిపింది కమిషన్.  మీడియాకు విచారణ కమిషన్ కు పోలీసులు కట్టుకథలు చెప్పారని కమిషన్ తెలిపింది. ఎన్ కౌంటర్ స్థలంలో సీసీ కెమెరా పుటేజ్ దొరక్కుండా చేసిందని రిపోర్ట్ ఇచ్చింది సిర్పూర్కర్ కమిషన్. దిశ నిందుతులే పోలీసులపై కాల్పులు జరిపారనేది అబద్ధం అని రిపోర్ట్ లో వెల్లడించింది.

దిశ నిందుతులను చంపాలనే ఉద్దేశంతోనే పోలీసులు కాల్పులు జరిపారంది కమిషన్. ఇది మూక దాడులు లాంటివే అని వ్యాఖ్యానించింది. ఈ ఎన్ కౌంటర్ కేసులో పోలీసుల మాటలు నమ్మశక్యంగా లేవంది కమిషన్. 10 మంది పోలీసు అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని సిఫార్సు చేసింది. వి. సురేందర్, కే. నరసింహా రెడ్డి, షేక్ లాల్ మదర్, మహ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, కే. వెంకటేశ్వర్లు, డి. జానకీ రామ్, ఎస్. అరవింద్ గౌడ్, ఆర్. బాలు రాథోడ్, శ్రీకాంత్  పై హత్యా నేరం పెట్టాలని కమిషన్ సిఫారసు చేసింది. ఈ కేసులో అప్పటి సీపీగా ఉన్న వి. సజ్జనార్ పై కేసు నమోదు చేయాలని కమిషన్ సిఫార్సు చేయలేదు.

10 మంది పోలీసులపై ఐపీసీ 302, రెడ్ విత్ 34, 201, రెడ్ విత్ 302, 34 సెక్షన్ల కింద విచారణ జరపాలని సూచించింది. ఈ మేరకు 387 పేజీల నివేదికను సుప్రీం కోర్ట్ కు సమర్పించింది. తాజాగా శుక్రవారం సుప్రీం కోర్ట్ దిశ ఎన్ కౌంటర్ కేసుపై విచారణ జరిగింది. సుప్రీం కోర్ట్ ఈ కేసును హైకోర్ట్ కు బదిలీ చేసింది. పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో నలుగురు నిందితులు మరణించారు. దీనిపై తాజాగా సిర్పూర్కర్ కమిషన్ విచారణ జరిపింది.