Dimple Hayati Lawyer Paul Satyanarayana Comments On DCP Rahul Hegde: సినీ నటి డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు నమోదైన విషయం తెలిసిందే. తానుండే అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్ వ్యవహారంలో హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో నెలకొన్న గొడవ నేపథ్యంలో.. ఆమెపై ఆ కేసు పెట్టారు. ఈ క్రమంలో డింపుల్ తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. డింపుల్‌పై తప్పుడు కేసు పెట్టారంటూ ఆయన బాంబ్ పేల్చారు. రోడ్ మీద ఉండే సిమెంట్ బ్రిక్స్ ప్రైవేట్ అపార్ట్మెంట్‌లోకి ఎలా వచ్చాయని ప్రశ్నించిన ఆయన.. ఈ విషయాన్ని తాము రెండు నెలలుగా అడుగుతున్నామని చెప్పారు. కానీ, ఈ సమస్యని పరిష్కరించకపోగా డింపుల్‌తో డీసీపీ రాహుల్ చాలాసార్లు రాష్‌గా మాట్లాడారని ఆరోపణలు చేశారు.
Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఇస్లామాబాద్ హైకోర్టు
డింపుల్ తన కారుని పార్క్ చేసే స్థలంలోనే కోన్స్ పెట్టారని.. ఒక సెలెబ్రిటీ అయిన డింపుల్ ఆ కోన్స్‌ని తొలగించాలని చాలాసార్లు చెప్పినా వినిపించుకోలేదని.. ఆ అసహనంతోనే ఆమె కోన్స్‌ని కాలితో తన్నిందని పాల్ సత్యనారాయణ పేర్కొన్నారు. డీసీపీ స్థాయి వ్యక్తి.. ఒక అమ్మాయి పట్ల ఎలా ప్రవర్తించాలా తెలియదా? అమ్మాయి మీదకి వెళ్లి మాట్లాడుతారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక సెలబ్రిటీగా, ఒక అమ్మాయిగా, అందులోనూ పోలీస్ ఆఫీసర్‌పై కేసు పెట్టేందుకు డింపుల్ వెనుకాడిందన్నారు. తీరా చూస్తే.. ఆ ఐపీఎస్ తన డ్రైవర్‌తో కేసు పెట్టారన్నారు. ఈ వ్యవహారంపై డింపుల్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిందని, కానీ ఆమె ఫిర్యాదుని తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 గంటలు ఆమెను పోలీస్ స్టేషన్‌లో కూర్చోపెట్టారన్నారు. ఈ గొడవపై తాము లీగల్‌గానే ఫైట్ చేస్తామని చెప్పారు.
Hansika: స్టార్ హీరో డేట్ కు వస్తావా అంటూ టార్చర్ పెట్టాడు.. హన్సిక సంచలన వ్యాఖ్యలు
తాను కేసు పెడతానని డీసీపీని డింపుల్ బెదిరించడంతో.. రివర్స్‌లో డింపుల్‌పై ఆయన కేసు పెట్టారని పాల్ సత్యనారాయణ వెల్లడించారు. డింపుల్‌ని వేధించాలన్న ఉద్దేశంతోనే డీసీపీ ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయినా.. డీసీపీ తనకు కేటాయించిన క్వార్టర్స్‌లో ఉండకుండా, ఈ అపార్ట్‌మెంట్‌లో ఎందుకు ఉన్నారు? అని న్యాయవాది నిలదీశారు. సిమెంట్ బ్రిక్స్ తీసుకురావాలంటే, చిన్న క్రేన్‌తో తేవాలని.. ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్‌లోకి వాటిని ఎలా తెస్తారో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రాపర్టీని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.