Site icon NTV Telugu

Gold Shop: ఫిలిం నగర్ శమంతక డైమండ్స్ షాపులో చోరీ.. కోటి విలువ చేసే డైమండ్స్, బంగారం..

Gold Shop Thif

Gold Shop Thif

Gold Shop: నాగోల్ స్నేహపురి కాలనీలో బంగారం చోరీ ఘటన మరువకముందే.. బంజారా హిల్స్ పోలిస్ స్టేషన్ పరిధిలోని ఫిలిం నగర్ సైట్-2లో భారీ చోరి సంచలనంగా మారింది. ఫిలింనగర్ లో శమంతక డైమండ్స్ షాపును నిర్వహిస్తున్న పవన్ కుమార్, గుజరాత్,సూరత్ బంగారం ముడి సరుకు తెచ్చి ఆర్డర్ పై ఆభరణాలు చేయించి యజమాని ఇస్తుంటాడు. మంగళ వారం షాపుకు తాళం వేసిన యాజమాని పవన్ కుమార్, బంగారం ముడి సరుకును లాకర్ లో పెట్టి ఇంటికి వెళ్లిపోయాడు. ఇక రోజూలాగేనే బుధవారం షాపుకు వచ్చిన యజమాని షాప్‌లో చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు షాప్‌ తెరిచి చూడగా.. సుమారు కోటి రూపాయల విలువ చేసే డైమండ్స్,బంగారం ముడి సరుకు చోరీకి గురైందని యజమాని పోలీసులకు తెలిపాడు.

Read also: Subscribers Want Free Content On OTTs: ఓటీటీలో ఉచిత కంటెంట్‌ వైపే ప్రేక్షకుల మొగ్గు

కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా.. యజమాని పవన్‌ ఓ ఇంటి లోని గదిని అద్దె కు తీసుకొని బంగారం,డైమండ్స్ తయారీ షాపు ను నడిపిస్తున్నట్లు గుర్తించారు. అద్దె కు తీసుకున్న ఇంట్లో కార్పెంటర్ వర్క్ చేస్తున్న వ్యక్తులపై యజమాని పవన్ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. షాపులోని వర్కర్స్ తో పాటు కార్పెంటర్ వర్క్ చేస్తున్న వ్యక్తులను పిలిపించి విచారిస్తున్నామని అన్నారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు తెలిపారు. అయితే.. ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో.. పోలీసులు దర్యాప్తు వేరేకోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

Read also: OTR about GHMC BRS: గ్రేటర్‌ బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?

ఇక జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకేసారి పది దుకాణాల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. నిన్న (బుధవారం) రాత్రి మెట్‌పల్లిలోని పాత బస్టాండ్‌ ప్రాంతంలో ఉన్న 10 షాపుల్లో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. దీంతో.. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటా హుటిన ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. అక్కడ వున్న అన్ని దుకాణాల్లో కలిపి మొత్తం రూ.10 లక్షలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Babu Jagjivan Ram: ‘బాబూజీ’గా జగజ్జీవన్ రామ్ బయోపిక్!

Exit mobile version