Arvind Dharmapuri: వడ్లకు బోనస్ ఇస్తామన్న సీఎం.. ఇప్పుడు ఆగస్టు అంటున్నాడని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలం అయ్యిందన్నారు. వడ్లకు బోనస్ ఇస్తామన్న సీఎం ఇప్పుడు ఆగస్టు అంటున్నాడని మండిపడ్డారు. రానున్న 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ కొనసాగిస్తామన్నారు. అవినీతి పరులు రానున్న కాలంలో జైల్ కు వెళ్ళక తప్పదన్నారు. మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, కేసీఆర్ లు ఎన్ఆర్సీ, సీఎఎలను వ్యతిరేకస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేఖి పార్టీ అన్నారు. బ్రిటిష్ వాళ్ళ కంటే మన సంస్కృతిని ధ్వంసం చేసింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు.
Read also: KTR: ఫ్రీ బస్సు మాయం కావడం ఖాయం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
కల్వకుంట్ల నిర్వాకం వల్ల గంజాయి, డ్రగ్స్ పెరిగాయన్నారు. కేసీఆర్ పైసలు మిగిల్చితే ఖమ్మం, నల్గొండ కాంగ్రెస్ నాయకులు తన్నుకపోయారని తెలిపారు. కాంగ్రెసొళ్ళు దోచుక తింటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదాయం లేదు ఉచితాలు ఎట్లా అమలు చేస్తారు ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో ఉంటే రేవంత్ ను బార్బత్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో ఇతర నేతలు ఎదిగితే గాంధీలు సాహించరు, ఇది కాంగ్రెస్ చరిత్ర అని కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ ను పీసీసీ అధ్యక్షులు చేయలేదు, ఇప్పుడు షర్మిలను చేశారని గుర్తు చేశారు.
Jaya Jaya Jaya Jaya Hey : తెలుగులో రీమేక్ కానున్న మలయాళం సూపర్ హిట్ మూవీ.. హీరో ఎవరంటే..?