Site icon NTV Telugu

Degree student missing: అత్తాపూర్ లో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌.. సెల్ ఫోన్ కాల్స్‌ పరిశీలిస్తున్న కాప్స్

Degree Student Missing

Degree Student Missing

Degree student missing: నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌ కలకలం రేపింది. ఇంట్లో తల్లి ఉండగానే డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌ కావడం సంచలనంగా మారింది. రాజేంద్రనగర్ లో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ సంచలనంగా మారింది.

Read also: ICC ODI WC 2023 : వరల్డ్ కప్ అర్హత కోసం సౌతాఫ్రికా అవస్థలు

హైదరాబాద్‌ లోని అత్తాపూర్ లో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. వారికి హుమర్ బెగమ్ అనే కూతురు కూడా ఉంది. గోల్కొండ మహిళ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న హుమర్ బెగమ్. రోజూ లాగానే తండ్రి ఉద్యోగానికి వెల్లడం, ఇంట్లో తల్లి, కూతురు ఉంటారు. అయితే హాల్ లో ఇద్దరూ కూర్చున్నారు. పని నిమిత్తం లోనికి వెల్లిన తల్లి బయటకు వచ్చిన తల్లికి ఇంట్లో హుమర్‌ బేగమ్‌ కనిపించలేదు. తన రూములో వుంటుందని భావించి కాసేపు హాల్‌ లోనే కూర్చుంది తల్లి. ఎంతసేపటి కూతురు బయటకు రాకపోవడంతో రూం లోకి వెల్లి చూసింది తల్లి. రూలో కూడా కూతురు కనిపించలేదు. దీంతో ఇల్లంతా వెతికింది అయినా ఫలితం లేకుండా పోయింది. ఎంత వెతికినా కూతురు కనిపించకుండా పోవడంతో భయాందోళన చెందిన తల్లి భర్తకు ఫొన్ చేసి సమాచారం ఇచ్చింది. విద్యార్థిని చదువుతున్న కళాశాలకు, స్నేహితులకు, బంధువులకు ఫోన్ చేశారు అయినా ఎక్కడా తన ఆచూకీ తెలియక పోవడంతో హుటాహుటిన అత్తాపూర్ పోలీసులను తల్లిదండ్రులు ఆశ్రయించారు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన సెల్ ఫోన్ కాల్ లిస్టు ను పరిశీలిస్తున్నారు. ఎవరైనా ఇంటికి వచ్చి ఎత్తుకెళ్లారా? లేక యువతి ఇష్టప్రకారమే ఎవరితోనైనా బయటకు వెళ్లిందా? వెల్లేటప్పుడు ఎవరెవరికి కాల్ చేసింది, ఎవరెవరిని సంప్రదించింది అనే కోణంలో క్యాప్స్ పరిశీలిస్తున్నారు.
Kartik Aaryan: కార్తీక్ ఆర్యన్ పెళ్లి వీడియో లీక్…వధువు ఎవరంటే..

Exit mobile version