Site icon NTV Telugu

Hussain Sagar : మూసీ, హుస్సేన్ సాగర్‌లలో తగ్గుతున్న కాలుష్యం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలు తమ నదులలో పెరుగుతున్న కాలుష్య స్థాయిలతో పోరాడుతున్న తరుణంలో, హైదరాబాద్ నగరంలోని రెండు ప్రధాన నీటి వనరులైన మూసీ, హుస్సేన్ సాగర్ నదులు కాలుష్యం నుంచి బయటపడుతున్నాయి. గత కొన్నేళ్లుగా మూసీ నది, హుస్సేన్ సాగర్ నీటి నాణ్యత చాలా మెరుగుపడిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC), తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (TSPCB), హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు (HMWSSB) సహా అనేక అధికారులు ఈ నీటి వనరులలో కాలుష్య స్థాయిలను తగ్గించడానికి కలిసి పనిచేస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోయేటప్పుడు బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు వినియోగించే ఆక్సిజన్ పరిమాణాన్ని సూచించే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD) స్థాయి మూసీలో పడిపోయింది. 2014లో BOD 58 mg/L ఉండగా, 2020లో అదే 22 mg/Lగా నమోదైంది.

నేషనల్ గ్రీన్ కార్ప్స్ డైరెక్టర్ డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఏదైనా నీటి వనరుల నాణ్యతకు దోహదపడే అతి పెద్ద కారకాలలో ఒకటి వర్షపాతం. “హైదరాబాద్‌లో కొన్ని మంచి రుతుపవనాలు ఉన్నాయి. ఫలితంగా మూసీ, హుస్సేన్ సాగర్‌లలో నీటి మెరుగుదల ఏర్పడింది. మరొక అంశం ఏమిటంటే, జీహెచ్‌ఎంసీ, టీఎస్‌పీసీబీ, హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బీలు తమ నీటి వనరులలోకి ప్రవేశించే మురుగునీటిని మొదట శుద్ధి చేసేలా నిరంతరం కృషి చేయడం. అధికారులు పూడిక తీసి ఘన వ్యర్థాలను తరలించి అందులో ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండేలా చూసుకున్నారు. ఇంతకుముందు 10 నుంచి 20 శాతం మురుగునీటిని మాత్రమే శుద్ధి చేసేవారు. అది ఇప్పుడు దాదాపు 70 నుంచి 80 శాతానికి చేరుకుంది’ అని ఆయన చెప్పారు.

Exit mobile version