Deccan Mall Fire Update: సికింద్రాబాద్ లోని మినిస్టర్ రోడ్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటన నగరం ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను ఫైర్ సిబ్బంది కాపాడారు. అయితే మరో ముగ్గురు గల్లంతయ్యారని వస్తున్న వార్తలపై ఇవాళ క్లారిటీ ఇచ్చారు. మంటల్లో వారి ఆచూకీ మాత్రం లోపల కనుగొనలేకపోయారు. మాల్ లో పెద్ద ఎత్తున మంటలు చలరేగడంతో.. వీరు ముగ్గురు సజీవ దహనం అయినట్లుగా తాజాగా గుర్తించనట్లు సమాచారం. ఆ.. మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీరు ముగ్గురు యువకులు షట్టర్స్ తీసేందుకు లోపలికి వెళ్లి మంటల్లో చిక్కుకుని పోయారు. ఈ ముగ్గురు యువకులు గజరాత్ కు చెందిన కూలీలు జునైద్, వసీం, అక్తర్ అని గుర్తించారు. వీరి ఆచూకీ లభ్యంకాని కూలీల సెల్‌ఫోన్ లోకేషన్ ను ట్రేస్ చేయగా వారు మంటలు చెలరేగిన భవనంలోనే ఉన్నట్లు చూపించింది. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో మృతదేహాలను గుర్తుపట్టినట్లు సమాచారం.
Read also:Gutha Sukhender Reddy: దేశ వ్యాప్తంగా గవర్నర్ల వ్యవస్థ భ్రష్టుపట్టింది
భవనంలో గల్లంతు అయిన కూలీల ఆచూకీ కోసం అగ్నిమాపక సిబ్బంది.. పోలీసులు సహాయక చర్యలు కొనసాగించారు. మంటల్లో చిక్కుకున్న కూలీల ఆచూకీ కోసం భారీ క్రేన్ సాయంతో బయట నుంచి భవనంలోని పై అంతస్తుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. సుమారు 12 గంటల పాటు విపరీతంగా మండిన మంటల వల్ల భవనం పూర్తిగా దెబ్బతిన్నందున గాలింపు పూర్తయ్యాక భవనం మొత్తాన్ని కూల్చివేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇక మంటల ధాటికి ఆరు అంతస్తుల భవనం పూర్తిగా దెబ్బతింది. అయితే.. భవనంలో 12 గంటలకు పైనే భారీ అగ్నికీలలు లోపలికి ఎవరూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇక అగ్నిప్రమాద సహాయ చర్యల్లో పాల్గొని అస్వస్థతకు గురైన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏడీఎఫ్‌వో ధనుంజయ రెడ్డితో పాటు ఫైరింజన్ డ్రైవర్ నర్సింగరావు నిన్న (గురువారం) అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నర్సింగరావు పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు సిబ్బంది.
Read also: Kishan Reddy: ఇప్పటి వరకు అగ్ని ప్రమాదాలైన బిల్డింగ్ లన్నీ అక్రమ కట్టడాలే
స్ట్రక్చరల్ ఇంజనీర్ అండ్ ఆర్కిటెక్చర్ ఆచూరి Ntv తో మాట్లాడుతూ.. రెండు కాలమ్స్ పైనే నిర్మాణం ఉందని తెలిపారు. ఆ కాలమ్ సైజెస్ కూడా కావలసినంత లేదని అన్నారు. నాలుగు అంతస్తుల కంటే ఎక్కువ ఎత్తుకు నిర్మించే కెపాసిటీ ఈ నిర్మాణానికి లేదని పేర్కొన్నారు. ముందు ముందు ఎలాంటి లోడు వేస్తారు అన్నదాన్ని బట్టి స్ట్రక్చరల్ స్టెబిలిటీ అంచనా వేయాల్సి ఉంటుందని, స్టీల్ గట్టిదనం గురించి పూర్తిగా పరిశీలించాలన్నారు. ఆర్సిబిసి మాత్రమే కాకుండా పోస్ట్ టెన్షన్ విధానంలో నిర్మాణం చేశారని తెలిపారు. భీములపైనే స్లాబుల నిర్మాణం అంతా ఉందన్నారు. స్టాండ్స్ లూస్ అయితే బిల్డింగ్ పడిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఆర్.సి.నిర్మాణానికి 500 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత వరకు తట్టుకునే శక్తి ఉంటుందని అన్నారు. కూల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. కూల్చేటప్పుడు బయటకి కాకుండా లోపలికి పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నిర్మాణానికి తగ్గట్టుగా పిల్లర్స్ సైజు లేదని స్పష్టం చేశారు.
Gas Cylinder: గ్యాస్ సిలిండర్‌పై అదనపు డబ్బులు ఇవ్వడం ఆపేయండి.. లేదంటే..