NTV Telugu Site icon

Damodar Raja Narasimha: ఆహార కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం..

Damodara Raja Narasimha

Damodara Raja Narasimha

Damodar Raja Narasimha: ఆహార కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హోటల్స్ అసోసియేషన్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని తెలిపారు. హైదరాబాద్ బిర్యాని కి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని గుర్తు చేశారు. హైదరాబాద్ ను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతున్నామన్నారు. హోటల్ ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి వర్క్ షాప్ ల నిర్వహణతో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తామన్నారు. హోటల్స్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై సానుకూల స్పందించారు.

Read also: BRS Chief KCR: విద్యుత్ కొనుగోలు వివాదంపై కేసీఆర్‌కు నోటీసులు..

భాగ్యనగరంలో పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. నాసిరకం ఆహారం సరఫరా చేస్తూ వినియోగదారుల జేబులు ఖాళీ చేయడమే కాకుండా.. వారి ఆరోగ్యాన్ని కూడా హోటళ్ల నిర్వాహకులు నాశనం చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ఫ్రిజ్ లలో నిల్వ ఉంచి, కాలం చెల్లిన మాంసం, వస్తువులను వంటకు వినియోగిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

Read also: Nagar Kurnool: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బ్యాంక్ మేనేజర్.. న్యూడ్ ఫోటోతో బ్లాక్ మెయిల్

చాలా చోట్ల నాసిరకం ఆహారం దొరకడంతో వాటి నమూనాలను నాచారం ల్యాబ్‌కు పంపించారు. కల్తీ, నాసిరకం ఆహారం తయారు చేస్తున్న రెస్టారెంట్లు, హోటళ్లపై నివేదికలు అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కొందరికి అవసరమైన మెడికల్ క్లియరెన్స్ కూడా లేదు. కొన్ని హోటల్ వంటశాలలు మురుగు కాలువల పక్కన ఉన్నాయి. ఫైవ్ స్టార్ హాటళ్లు, ఐస్ క్రీమ్ పార్లర్లు, బేకరీలు, ప్రమాదకర రంగులు, ఇతర రసాయనాలు వినియోగిస్తున్నారని అధికారులు ఆశ్చర్యానికి గురి చేశాయి. దీంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సీరియస్ అయ్యారు.
Rakul Preet Singh: నా కెరీర్‌లోనే బెస్ట్‌ సినిమా ఇది: రకుల్‌