Site icon NTV Telugu

Montha Cyclone: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఆ జిల్లాలోని సూళ్లకు సెలవులు

Untitled Design (12)

Untitled Design (12)

మెంథా తుఫాన్ ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల రైళ్లను కూడా రద్దుచేశారు. నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్‌ లోని అంతర్వేదిపాలెంద దగ్గర మెంథా తుఫాన్ తీరాన్ని తాకింది. దీంతో రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో పలు జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

Read Also: Lucky Biscuit: 10 రూపాయల బిస్కెట్ ఎంత పని చేసిందో తెలుసా…

మెంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది వాతావరణ శాఖ. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్ ఆరెంజ్ అలర్ట్, కుమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు జిల్లాలలోని స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

Read Also:Fenugreek Seeds: శరీరంలోని కొవ్వు తగ్గించుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..

మహబూబాద్ జిల్లాలో కూడా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. దీంతో నేటి త్రైమాసిక పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇక ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి , ఇలా త్రిపాఠి సెలవు ప్రకటించారు. అదేవిధంగా తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని తెలిపారు.

Exit mobile version