NTV Telugu Site icon

Cyberabad CP: ట్రాఫిక్ సమస్యపై కొత్తగా ప్రణాళికలు.. రెగ్యులర్ క్రైమ్స్ పై దృష్టి

Cybarabad Cp Avinash Mahanthi

Cybarabad Cp Avinash Mahanthi

Cyberabad CP: ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి కొత్తగా ప్రణాళికలు సిద్ధం చేస్తామని సైబరా బాద్ సీపీ అవినాష్ మహంతి అన్నారు. సైబరా బాద్ సీపీ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అవినాష్ మహంతి మాట్లాడుతూ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కీలకమైన సంస్థలు ఉన్నాయన్నారు. నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేయడంతో పాటు చట్టబద్ధంగా పని చేస్తామన్నారు. మా వద్ద ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ భద్రత,రక్షణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు. అతిపెద్ద సమస్యగా మారిన సైబర్ క్రైమ్స్ పై ప్రత్యేక దృష్టి పెడతామని హామీ ఇచ్చారు. అన్ని రకాల కేసులను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Read also: Parliament Attack : పార్లమెంట్‌ లో భద్రతా వైఫల్యం.. గ్యాలరీ నుంచి సభలో కి దూకిన ఇద్దరు అగంతకులు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి కొత్తగా ప్రణాళికలు సిద్ధం చేస్తామని మహంతి అన్నారు. రెగ్యులర్ క్రైమ్స్ పై దృష్టి సారిస్తామని తెలిపారు. డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా ఉంచడమే కాకుండా డ్రగ్స్ ఎక్కడినుండి వస్తున్నాయి ఆన్న అంశాలపై విచారణ చేస్తామని అన్నారు. 31 డిసెంబర్ రోజున వేడుకలు పోలీస్ నిబంధనలు అనుగుణంగా జరుపుకోవాలన్నారు. పబ్బులు ఫామ్ హౌస్ లపై అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెడతామని తెలిపారు.
Parliament Attack : పార్లమెంట్‌ లో భద్రతా వైఫల్యం.. గ్యాలరీ నుంచి సభలో కి దూకిన ఇద్దరు అగంతకులు