Barber Shop: ఓ యువకుడు బార్బర్ షాప్ కి వెళ్లాడు. అక్కడ బార్బర్ తో తల మసాజ్ చేయాలని కోరాడు. అయితే బార్బర్ కస్టర్ ను గమనించి అతని మెడలో వున్న గొలుసుపై కన్ను వేశాడు. అయితే షాప్ లో కొందరు ఉండటంతో కాసేపు ఆగాలని కోరాడు. దీంతో కస్టమర్ సరే అంటూ అక్కడే కూర్చున్నాడు. అయితే షాప్ లో అందరూ వెళ్లిపోయారు. దీంతో ఇదే అలుసుగా భావించిన బార్బర్ కస్టమర్ ను మసాజ్ కూర్చొమన్నాడు. ముఖం పై బట్టవేసి మసాజ్‌చేయండ ప్రారంభించాడు. రిలాక్స్ గా ఉండటంతో కస్టమర్ కునుకు తీసాడు. ఆ తరువాత బిల్లు కట్టి ఇంటి వచ్చాడు. ఇంటికి వచ్చిన కస్టమర్ మెడలో బంగారం గొలుసు కనిపించలేదు. దీంతో కంగారు పడ్డ వ్యక్తి లబోదిబో మంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఆశ్రయిచడంతో బండారం బట్టబయలు అయ్యింది.
Read also: Bihar: భూమ్మీద నూకలుండడం అంతే ఇదేనేమో.. రైలు కిందపడ్డా చిన్న గీతకూడా పడలేదు
టోలిచౌకి ఎండీ లైన్స్‌లో నివసించే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆదిత్య నివాసం ఉంటున్నాడు. అయితే తొడలపల్లి టోలిచౌకి ఐఏఎస్ కాలనీలో ఉన్న అవిద్స్ బార్బర్ షాప్‌కు మసాజ్ కోసం వెళ్లాడు. అప్పుడు తన మోడలో రూ.80 వేల ఖరీదు చేసే చైన్ మెడలో ఉంది. అయితే మసాజ్ పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. బార్బర్ షాప్‌కు వెళ్లినప్పుడు ఉన్న గొలుసు తిరిగి వచ్చేటప్పటికే ఏమైందని కంగారుపడ్డాడు. సుమారు రూ. 80 వేల విలువ చేసే బంగారు గొలుసును మసాజ్ చేస్తున్న సమయంలో సదరు వ్యక్తి దొంగిలించి ఉంటాడని అనుమానిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బార్బర్ షాక్ కు వెళ్లి ఆరా తీస్తున్నాడు. మిగతా వివరాలు ఆరా తీస్తున్నారు.
Fire Accident: ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్ లో అగ్నిప్రమాదం.. కస్టమర్స్ ఏంచేశారంటే..