Site icon NTV Telugu

CS Somesh Kumar : టీఎస్‌ బీపాస్ విజయవంతంగా అమలవుతోంది

సీఎం కేసీఆర్‌ ఎంతో సదుద్దేశంతో ప్రారంభించిన టీఎస్ బీపాస్ గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలు జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో టీఎస్ బీపాస్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల అమలు కోసం పట్టణాలు, పంచాయితీలు, స్ధానిక సంస్థల పరిధిలో జనన, మరణాలను ఖచ్చితంగా నమోదు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జనన, మరణాలను వందశాతం నమోదు చేసేలా అధికారులు చర్యలుతీసుకోవాలని, ఈ విషయంలో జీహెచ్ఎంసీ కమిషనర్, సీడీఎంఏ, హెచ్ఎంఎఫ్ఎం తగిన విధంగా స్పందించి కేవలం హాస్పటిల్స్ లోనే కాకుండా స్మశాన వాటికలు, క్రిమేషన్ గ్రౌండ్ లలోనూ తగిన సమాచారంతో నమోదుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీని కోసం ఆన్ లైన్ నోటిఫికేషన్లను జారీ చేయాలన్నారు.

https://ntvtelugu.com/shabbir-ali-fired-on-bjp-and-trs/
Exit mobile version