తెలంగాణలో త్వరలోనే బార్ లైసెన్స్‌ల గడువు ముగియనుంది.. ఇక వైన్ షాపుల గడువు వచ్చే నెల ముగియబోతోంది.. ఈ నేపథ్యంలో కొత్త మద్యం పాలసీపై సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్.. రాష్ట్రంలో సెప్టెంబర్ 30వ తేదీతో బార్ల లైసెన్స్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో.. 2021 – 22 సంవత్సరానికి గాను నూతన బార్స్ లైసెన్స్ లకు సంబంధించి చర్చించారు.. ఇక, ఏ4 వైన్ షాప్ ల లైసెన్సుల గడువు అక్టోబర్ 31వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో నవంబర్ 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చే నూతన ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన విధి విధానాలపై చర్చించారు.. మరోవైపు.. నీరా ప్రాజెక్టు పనులను వచ్చే రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్.
కొత్త మద్యం పాలసీపై సమీక్ష.. విధి విధానాలపై కసరత్తు

liquor