Site icon NTV Telugu

CPM leaders will meet with KCR: ఇవాళ సీఎం కేసీఆర్‌తో సీపీఎం నేతలు భేటీ.. ప్రజా సమస్యలపై చర్చ

Cpm Leaders Will Meet With Kcr

Cpm Leaders Will Meet With Kcr

CPM leaders will meet with KCR: సీఎం కేసీఆర్‌తో సీపీఎం నేతలు నేడు భేటీకానున్నారు. ఈనేపథ్యంలో.. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు సీపీఎం మద్దతు ప్రకటించిన తరవాత తొలిసారి సీఎంతో సమావేశం అవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకోనుంది. దీంతో ఇవాళ రాత్రి 7 గంటలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు ప్రగతి భవన్‌కు వెళ్లనున్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు తాజా రాజకీయాలపైన సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈనేపథ్యంలో.. సీఎంతో సమావేశం నేపథ్యంలో పలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తెలిపారు.

బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్‌ చేస్తున్న పోరాటాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి.. ఈ ఎన్నికలో తమ మద్దతు టీఆర్‌ఎస్‌ పార్టీకే ఉంటుందని మునుగోడు సభకు ముందు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్న మాటలివి. ఇక ఈ ఒక్క ఎన్నికలో మాత్రమే టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ఇస్తామని నిన్నటి సమావేశంలో తెలిపారు. దీంతో ఆయన ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్​ భేటీ కావడం ప్రాధాన్యత సంచరించుకుంది. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి రాజీనామాతో, ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ సందర్బంగా.. రాజగోపాల్​రెడ్డి కాంగ్రెస్​ను వీడి భాజపాలో చేరటంతో, రాజకీయ పరిణామాలు పూర్తీగా మారిపోయాయి.

ఇక కాంగ్రెస్​కు అడ్డాగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో కలవరం మొదలైంది. మునుగోడు ఉపఎన్నికలో ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు ఇప్పటికే పావులు కదుపుతున్నాయి. ఇక జెండా మారినా- బ్రాండ్​ వ్యాల్యూతో బీజేపీ నుంచి అభ్యర్థిగా రాజగోపాల్​రెడ్డి మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. దీంతో.. అటు అధికార పార్టీ కూడా, మునుగోడులో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు.. సభలతో బలప్రదర్శన చేస్తుంటే, కాంగ్రెస్​ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక సిట్టింగ్​ స్థానాన్ని ఎలాగైనా ఒడిసిపట్టుకుని ఉనికి చాటుకోవాలనుకుంటోన్న హస్తం పార్టీ, అభ్యర్థి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తోందనే చెప్పాలి.
Supreme Court: జనాభా పెరుగుదలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

Exit mobile version