Site icon NTV Telugu

ఎన్ని పార్టీలు అధికారంలోకి వచ్చిన ప్రజల బ్రతుకులు మారలేదు

స్వాతంత్రం వచ్చిన దేశం ఏమి మారలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కామెంట్స్ చేశారు. స్వాతంత్రం తెచ్చిన పెద్దలు ఉన్నారు, మేము అనుకున్న స్వాతంత్రం ఇది కాదని బాధపడుతున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేటలో నిరుద్యోగుల పోరు సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి ఈ సందర్బంగా మాట్లాడారు. దేశంలో అనేక సమస్యలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గొప్పది. దేశంలో, రాష్ట్రంలో రంగు రంగుల పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి.. అయినా ప్రజల బ్రతుకులు మారలేదన్నారు. దేశంలో సంతోషంగా ఉన్నది ఎవరంటే కార్పొరేట్ శక్తులు మాత్రమేనన్నారు. రాజా ద్రోహం కేసు పెట్టి ఇప్పటి వరకు వరవరరావుకు బెయిల్ ఇవ్వలేదు, రాజా ద్రోహం కేసు ప్రధాని మోదీపై పెట్టాలి. చట్ట సభలో 50 శాతం మంది, నేర చరిత్రగల వారే ఉన్నారని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు.

Exit mobile version