NTV Telugu Site icon

CPI Narayana: రష్మికకు ఫీలింగ్స్ పాట చేయడం ఇష్టంలేదు.. డైరెక్టర్‌ చెప్పడం వల్లే చేసింది..

Cpi Rashmika

Cpi Rashmika

CPI Narayana: పుష్ప-2 ఈనెల 5న విడుదలై సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలోని ఫీలింగ్ సాంగ్ దుమారం రేపుతుంది. దీనిపై హీరోయిన్ రష్మిక ఫీలింగ్ పాటకు డాన్స్ చేయడం తనకు ఇష్టం లేకపోయిన డైరెక్టర్ చెప్పడం వల్ల చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. దీనిపై సీపీఐ నారాయణ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ రష్మికకు ఫీలింగ్స్ పాటకు డాన్స్ చేయడం ఇష్టం లేదు.. కానీ డైరెక్టర్ చెప్పడం వల్ల చేయాల్సి వచ్చిందని చెప్పిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: CPI Narayana: సినీ ప్రముఖులతో సీఎం సమావేశం.. సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు..

అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మాభిమానం చంపుకుని పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. సినిమా హీరోలు రోడ్ షోలు ఎందుకు చేయడం? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరో షో చేస్తున్నప్పుడు… జనం వెంట పడటం సహజం అన్నారు. ప్రభుత్వాలు కూడా 100 రూపాయల టికెట్ వెయ్యి రూపాయలు చేయడం ఎందుకు ? అని నారాయణ ప్రశ్నించారు. పుష్ప సినిమాలో ఏముంది? ఒక ఎర్రచందనం దొంగ నీ హీరోగా చూపించారు. దాన్ని యువత మీద రుద్దుతున్నారని నారాయణ మండిపడ్డారు.

Read also: SI Missing Case: మిస్టరీగా మారిన భిక్కనూరు ఎస్సై మిస్సింగ్.. నిన్న మధ్యాహ్నం నుంచి ఫోన్ స్విచ్‌ఆఫ్

ఇవాళ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశంపై నారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలపై భారం మోపకుండా చూడాలి. టికెట్ల ధరలు పెంచితే బ్లాక్ మార్కెట్ ప్రోత్సహించినట్టే. ఎవరు బాధ్యత వాళ్ళు నిర్వహించేలా చర్చలు ఉండాలి. సినిమా వాళ్ళు వేల కోట్లు ఖర్చు పెట్టీ సినిమాలు తీస్తున్నారు. ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి, సినిమా టిక్కెట్లు రేట్లు పెంచుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వెయ్యి కోట్లు ఖర్చు చేసి…రెండు వేల కోట్లు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు టికెట్ల రేట్లు పెంచి ప్రోత్సహించాలి? అని నారాయణ ప్రశ్నించారు. సందేశాత్మక చిత్రాలు ఐతే ప్రోత్సాహకాలు ఇవ్వాలి కానీ.. క్రైమ్, అశ్లీలత పెంచే సినిమాలకు బెనిఫిట్ ఎందుకు చేయాలి?. సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబానికి రూ.2 కోట్లు కాదు ఐదు కోట్లు ఇచ్చిన ప్రాణాలు తెచ్చి ఇవ్వలేరన్నారు.
CPI Narayana: సినీ ప్రముఖులతో సీఎం సమావేశం.. సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు..

Show comments