నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక ప్రజలపై పన్నుల భారం అధికమైంది. పన్నుల మీద పన్నులు మోపుతున్నారు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తూ.. కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇస్తున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ధరల పెరుగుదల పేద ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు తగ్గించుకుంటే పేదలపై భారం తగ్గుతుంది. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కరోనా ఔషదాల మీద కూడా పన్నులు వసూలు చేస్తున్నారు. ధరల పెరుగుదలపై పోరాటానికి యువత ముందుకు రావాలి. కేంద్రం తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలి. లేనిపక్షంలో ప్రజలు మోదీని గద్దె దించుతారు పేర్కొన్నారు.
మోదీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది…
