NTV Telugu Site icon

CP CV Anand : డ్రగ్స్‌ని సాఫ్ట్‌వేర్‌ వాళ్లే ఎక్కువగా వాడుతున్నారు

మూడు డ్రగ్స్‌ కేసులలో 11 మంది అరెస్ట్ చేశామని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. శనివారం ఆయన బషీర్‌బాగ్‌లో సీపీ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 4.50 లక్షల రూపాయలు విలువ చేసే డ్రగ్స్, లాప్ టాప్ మొబైల్ ఫోన్లు సీజ్ చేసామని తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఏడుగురిని అరెస్ట్ చేయగా.. ఒకరు పరారీ లో ఉన్నారన్నారు. నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏర్పాటు చేసిన తర్వాత పెద్ద ఎత్తున డ్రగ్స్ సరరా చేస్తున్న ముఠా అరెస్ట్ చేశామన్నారు. సాప్ట్ వేర్ ఉద్యోగులే ఎక్కువ మంది ఈ డ్రగ్స్ కేసులో ఇందులో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 11 మంది సాప్ట్ వేర్ ఉద్యోగులు ఉన్నారని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో డ్రగ్స్ ఎక్కువ వాడుతున్నారన్నారు.

స్టూడెంట్స్ ను అరెస్ట్ చేయాలా.. లేదా కౌన్సిలింగ్ ఇవ్వాలా అర్థం కాలేదన్నారు. చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అందుకే వీళ్ళని అరెస్ట్ చేసామన్నారు. డార్క్ నెట్ వెబ్ సైట్ పై నిఘా పెట్టామని, నిమ్మగడ్డ సాయి విఘ్నేష్ అనే స్టూడెంట్ కి డ్రగ్స్ అలవాటు ఉందని ఆయన తెలిపారు. డార్క్ నెట్ వెబ్ సైట్ ద్వారా ఈ విద్యార్ధి ఎల్ఎస్‌డీ బ్లాడ్స్‌ను రూ.1200 లకు 20 కొన్నాడన్నారు. ఇక్కడ వీటిని ఐదు రెట్లు ఎక్కువకి అమ్ముతున్నారని, 10 బ్లాడ్స్ ను ఒక పార్టీలో వినియోగించారన్నారు. 10 బ్లాడ్స్ ను వేరే వాళ్ళకీ అమ్మారని, గోవా నుంచి హైదరాబాద్ కి తీసుకోని వచ్చి డ్రగ్స్ అమ్ముతున్నారని ఆయన తెలిపారు.

ఎండీఎంఏ అనే డ్రగ్‌ని ఒక నైజీరియన్ దగ్గిర కొంటున్నారని, ఓ నైజీరియన్ చాలా కాలం నుంచి ముంబాయి లో 2013 నుండి అనుమతి లేకుండా ఉంటున్నాడని ఆయన వెల్లడించారు. జ్వాల పాండే అనే వ్యక్తి హాష్ ఆయిల్ అనే డ్రగ్ ను సరఫరా చేస్తున్నారని, నిఖిల్ అనే వ్యక్తి ఈ హాష్ ఆయిల్ నీ ఇక్కడ కొనుగోలు చేస్తున్నాడని పేర్కొన్నారు. జ్వాల పాండే అదిలాబాద్ జిల్లా కి చెందిన రైతులు నుంచి నేరుగా గంజాయి ఒప్పందం చేసుకొని సరఫరా చేస్తున్నారని, సొన రాయి అనే రైతు మరొక రైతు నుంచీ కొనుగోలు చేస్తున్నారన్నారు. ఒక కేజీ 15 వేలకి కొని 50 వేల రూపాయలకి ఐటి ఉద్యోగులకి అమ్ముతున్నారని తెలిపారు.

మంగళ్ హాట్ కి చెందిన ఓ వ్యక్తి జొమాటో డెలివరీ బాయ్ లానే ఇంటికీ వెళ్ళి గంజాయి డెలివరీ చేస్తాన్నాడని తెలిపారు. చాలా మంది సాప్ట్ వేర్ ఉద్యోగులే ఈ కేసులో ప్రమేయం ఉందని, యూనివర్సిటీ లో విచ్చలవిడి గా డ్రగ్స్ వినియోగం పెరిగిందని ఇప్పటి నుంచి డ్రగ్స్ వినియోగం చేస్తున్న వారిని వదిలి పెట్టే అవకాశం లేదని ఆయన హెచ్చరించారు.