Miyapur CI suspended: ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళపై అనుచితంగా ప్రవర్తించిన మియాపూర్ సీఐపై వేటు పడింది. సీఐ ప్రేమ్ కుమార్‌ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. నాలుగు నెలల క్రితం భార్యాభర్తల 498 కేసుకు సంబంధించి మియాపూర్ ఇన్ స్పెక్టర్ ప్రేమ్ కుమార్ ను కలిసింది. ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా సీఐ దురుసుగా ప్రవర్తించాడని మహిళ సీపీకి ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు సీపీ అవినాష్ మహంతి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా మహిళపట్ల సీఐ అమర్యాదగా ప్రవర్తించాడని లేలింది. దీంతో సీపీ సీఐ ప్రేమ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read also: DCP Vijay Kumar: ప్రజాభవన్ ముందు యాక్సిడెంట్ కేసు.. దుబాయ్ లో రాహిల్, షకీల్..
కాగా, విధులు సక్రమంగా నిర్వహించలేదని తెలంగాణలో పలువురు సీఐలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో పంజాగుట్ట సీఐ దుర్గారావుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. గోపాలపురంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకేసులో విచారణ సరిగా లేకపోవడంతో ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పటాన్ చెరువు సీఐ లాలూనాయక్‌ను కూడా సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి మృతికి కారణమయ్యాడని పేర్కొంటూ సీఐని సస్పెండ్ చేస్తూ ఎస్పీ రూపేష్ ఉత్తర్వులు జారీ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి ప్రక్షాళన చేయడం హాట్ టాపిక్‌గా మారింది. భోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీలక విషయాలను లీక్ చేస్తూ పంజాగుట్ట పీఎస్ సిబ్బందిని సీపీ బదిలీ చేయడం సంచలనం సృష్టించింది.
Purandeswari: ఏపీలో పవన్‌కళ్యాణ్‌తో బీజేపీకి పొత్తు ఉంది.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు