కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు తీవ్రస్థాయిలో దాడి చేస్తోంది.. దేశవ్యాప్తంగా కొత్త కేసులు భారీ స్థాయిలో పెరుగుతూ పోతున్నాయి.. అన్ని రాష్ట్రాల్లోనూ థర్డ్ వేవ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.. అయితే, వైరస్ వ్యాప్తితో ఎక్కువ మంది బాధితుల్లో లక్షణాలు పెద్దగా కనిపించకపోవడం ఆందోళనకు గురిచేసే అంశం.. ఎందుకంటే.. వీరి నుంచి మరికొందరికి ఈ మహమ్మారి సోకుతూ పోతోంది.. 60 శాతం మంది అసింప్టమాటిక్‌గా, మరో 30 శాతం మందిలో స్వల్ప లక్షణాలు ఉంటున్నట్టు వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్న మాట.. లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలు కలిగిన వారు హోం ఐసోలేషన్‌లోనే ఉండాలని ఐసీఎంఆర్ తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.. ఈ లెక్కన కరోనా పాజిటివ్ వస్తున్నవారిలో 90 శాతం మంది హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నారన్న మాట.. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ గురుంచి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు సన్ షైన్ హాస్పిటల్స్ సన్ షైన్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ గురువారెడ్డి… మహమ్మారి సోకితే ఉండే లక్షణాలు.. దాని బారినపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సినవి, చేయకూడనవి.. ఇలా అనేక అంశాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
కరోనా సోకితే వుండే లక్షణాలు:
- జలుబు
- గొంతు గరగర , పొడిదగ్గు
- ఒంట్లో కొద్ది పాటి నలత
- ఒకటి రెండు రోజులు జ్వరం
కోవిడ్ సోకితే ఏం చేయాలి..?
- వారం రోజుల పాటు వేడి నీటిని తాగండి.. రోజుకు పెద్దలైతే నాలుగు లీటర్లు, పిలల్లు అయితే కనీసం రెండు లీటర్లు
- వేడి నీటిలో ఉప్పు వేసుకొని గార్గిల్ చేయడం
- బీ, సీ, డీ విటమిన్ మాత్రలు, జింక్ మాత్రలు వారం పాటు తీసుకోవాలి
- అల్లం, పసుపు కషాయాన్ని రెండు, మూడు రోజుల పాటు తీసుకోవడం. (కొద్ది మోతాదులో టీ తాగినట్టు.. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు)
- షుగర్ వ్యాధి లేనివారు రోజుకు ఒక అరటిపండు , అందరూ పాల కూర, నానపెట్టిన బాదాం వారం పాటు తీసుకొంటే బెటర్.
- పల్స్ ఆక్సీ మీటర్‌లో ఆక్సిజన్ చూసుకోవడం మంచిది.. 94 కంటే ఎక్కువ ఉండాలి..
- జ్వరం ఉంటే డోలో 650 వేసుకోవడం మరవొద్దు..
ఆస్పత్రికి ఎప్పుడు వెళ్లాలి..?
- ఐదు రోజుల వరకు కూడా జ్వరం తగ్గకపొతే ఆస్పత్రికి వెళ్లాలి..
- ఒకవేళ ఆక్సిజన్ శాతం 92 దాటి ఇంకా కిందకు పడిపోతుంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లడం బెటర్.
ఈ సమయంలో అవసరం లేనివి :
- కరోనా అవునా కాదో తెలుసు కోవడానికి టెస్ట్ చేసుకోవడం..
- హెచ్ఆర్‌సీటీ అంటే స్కానింగ్ చేయించుకోవడం అవసరంలేదు.
కీడు చేసేవి ఇవే జాగ్రత్తగా గమనించండి..
- భయపడడం, ఆందోళనకు గురికావడం.
- పైన చెప్పినవి కాకుండా ఇతరత్రా మాత్రలు ముఖ్యంగా మాలనుపైరవీర్ మాత్రలు, స్టెరాయిడ్ మాత్రలు, ఇంజక్షన్‌లు తీసుకోవడం
- ఇతరత్రా మాత్రలు మాలనుపైరవీర్, స్టెరాయిడ్ మాత్రలు, ఇంజక్షన్‌లు తీసుకుంటే ఆరోగ్యం దారుణంగా దెబ్బతింటుంది.
ఒకరికి లక్షణాలు ఉన్నాయంటే అందరికీ సోకినట్టే..
- ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తుంది.
- కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఈ లక్షణాలు వున్నాయంటే అందరికీ సోకినట్టే..
- కరోనా సోకినవారు ఒక రూమ్‌లో ఐసోలేటె కావడం లాంటివి అక్కర లేదు.
- గర్భిణీలు, చంటి పిల్లలు, పాలిచ్చే తల్లులు.. ఇలాంటి వారి గురించి ఎటువంటి భయం వద్దు. ప్రత్యేక జాగ్రత్తలు అవసరం లేదు .
కరోనా ఎవరికి డేంజర్..?
- గతంలో ఒకసారి కోవిడ్ సోకినవారికి దీనితో ఎలాంటి సమస్య లేదు.
- గతంలో సోకినవారు వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకోకున్నా ఎలాంటి సమస్య లేదు.
- గతంలో సోకకుండా తప్పించుకున్నవారు వ్యాక్సిన్ వేసుకొని ఉంటే కూడా దీనితో సమస్య రాదు.
- గతంలో సోకకుండా వ్యాక్సిన్ వేసుకోకుండా ఉన్నవారు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి.
- సహజ ఇమ్మ్యూనిటి బలహీనంగా ఉంటే వారికి దీనితో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
- తెలియనివారికి తెలియచెప్పండి. అనవసరంగా టెస్టింగ్ కేంద్రాలకు వెళ్లి డబ్బు తగలేసుకోవద్దు.
- కొన్ని అనవసరమైన మాత్రలు తిని కేన్సర్ ముప్పు తెచ్చుకొంటున్నారు.
- కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత బ్లాక్ ఫంగస్ వచ్చింది. దానికి కారణం స్టెరాయిడ్‌లు, ఇప్పుడు కేన్సర్ వస్తుంది . కారణం కొన్ని మాత్రలు అని చెబుతున్నారు.