తెలంగాణలో మరో మంత్రి కరోనా మహమ్మారి బారినపడ్డాడు.. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులకు కరోనా సోకింది.. వారిలో కొందరు ప్రాణాలు వదలగా.. చాలా మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. తాజాగా, మంత్రి గంగుల కమలాకర్‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. గత రెండు రోజుల నుంచి జలుబు, జ్వరంతో బాధపడుతున్న మంత్రికి.. తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది.. దీంతో.. హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయిన మంత్రి గంగుల కమలాకర్.. ఈ మధ్య తనను కలిసినవారు, సన్నిహితంగా మెలిగిన ప్రతి ఒక్కరూ.. టెస్ట్‌లు చేయించుకోవాలని కోరారు.
మరో తెలంగాణ మంత్రికి కరోనా పాజిటివ్..
