Site icon NTV Telugu

Gutha Sukender Reddy: విమోచన దినం అనడం దౌర్బాగ్యం.. గవర్నర్‌ వ్యాఖ్యలపై గుత్తా సీరియస్‌..

Gutta Sukhender Reddy, Governor Tamilisai

Gutta Sukhender Reddy, Governor Tamilisai

Gutha Sukender Reddy: గవర్నర్‌ వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీరియస్‌ అయ్యారు. రాష్ట్ర గవర్నర్ కూడా విమోచన దినం అని వ్యాఖ్యలు చేయడం దౌర్బాగ్యం మని మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో కలిసి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా.. ఆయన అందరికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా వుందని అన్నారు. ఆనాడు పోరాటంలో అసువులు బాసిన వారికి జోహార్లు అంటూ వ్యాఖ్యానించారు.

Read also: Kangana Ranaut: అవన్నీ ఫేక్ కలెక్షన్లు అంటూ ధ్వజమెత్తిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్

బాధ్యత లేకుండా కొంత మంది విలీనం, విమోచనం అంటూ, ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడటం దౌర్భాగ్యం అని అన్నారు. విషయం తెలుసుకోకుండా అలా మాట్లాడటం సరైన పద్దతి కాదని అన్నారు. రాష్ట్ర గవర్నర్ కూడా విమోచన దినం అని వ్యాఖ్యలు చేయడం దౌర్బాగ్యం అని గుత్తా మండిపడ్డారు. గవర్నర్‌ పని చేసిన తన పూర్వ పార్టీ భావజాలాన్నే అనుసరిస్తుందని అన్నారు. గవర్నర్ వ్యవస్థకి వుండే గౌరవం పోగొట్టొద్దని గుత్తా విమర్శించారు. కేంద్రం హైదరాబాద్ పరేడ్ గ్రౌడ్ లో నిర్వహించే సభ పెట్టడం సరికాదన్నారు. కేంద్రం ఫెడరల్ వ్యవస్థ కి విఘాతం కలిగిస్తున్నదని మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా.. నిన్న (బుధవారం) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ లిబరేషన్ మూవ్‌మెంట్.. ఫోటో అండ్‌ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను గవర్నర్ ప్రారంభించి మాట్లాడుతూ సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా చేసుకోవాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్ర ప్రజలపై రజాకార్ల అరాచకాలను మర్చిపోలేమని అన్నారు.. ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం విలీన వజ్రోత్సవాల పేరుతో కార్యక్రమాలు చేస్తుంటే రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ ఈ రోజును విమోచన దినోత్సవంగా నిర్వహించుకోవాలని సూచించడంపై గుత్తా ఫైర్ అయ్యారు.
Uttarpradesh: పొలంలో చెట్టుకు వేలాడుతూ ఇద్దరు యువతుల మృతదేహాలు.. అసలేం జరిగిందంటే?

Exit mobile version