తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1511 కరోనా కేసులు నమోదు కాగా.. 12 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో 1.36 పాజిటివ్ రేటుగా వుంది. ప్రస్తుతం 16 శాతం బెడ్ ఆక్యుపెన్సీ ఉంది. ప్రతి రోజు 2 లక్షల మందికి వాక్సిన్ జరుగుతుందని తెలంగాణ వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 80 లక్షల డోసులు వాక్సిన్ పూర్తి కాగా, 9 లక్షల 25 వేల స్టాక్ రాష్ట్రంలో ఉంది. ఇప్పటి వరకు 350 ఫిర్యాదులు రాగా, 170 ప్రయివేట్ ఆస్పత్రులపై వచ్చాయని వైద్య శాఖ తెలిపింది. సీజనల్ వ్యాధుల వల్ల అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. మలేరియా ఎలిమినేషన్ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. థర్డ్ వేవ్ విషయంలో మీడియా సంయమనంతో వ్యవహరించాలన్నారు. థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని.. బ్లాక్ ఫంగస్ కు పూర్తి మందులను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వైద్య శాఖ తెలిపింది.
తెలంగాణలో సాధారణ పరిస్థితులు.. 1.36 పాజిటివ్ రేటు
Show comments