NTV Telugu Site icon

Sri Rama Pattabhishekam: నేడు భద్రాద్రిలో శ్రీరామ పట్టాభిషేకం.. పోటెత్తిన భక్తజనం

Sri Rama Pattabhishekam

Sri Rama Pattabhishekam

Sri Rama Pattabhishekam: దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలో సీతారాముల వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఆలయ అర్చకులు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవం నిర్వహిస్తారు. కల్యాణం నిర్వహించిన మిల మండపంలోనే ఈ క్రతువు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అధికారులు వెల్లడించారు. రాములోరి పట్టాభిషేకం కోసం దేశంలోని నలుదిక్కులకు వెళ్లి నదులు, సముద్రాలు, సరస్సుల నుంచి వైదిక సిబ్బంది పుష్కర జలాలను తీసుకొచ్చారు. ఈ శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకంలో పాల్గొనేందుకు గవర్నర్‌ తమిళిసాయి నిన్న రాత్రి భద్రాద్రికి వెళ్లారు. భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం కొత్తగూడెం వరకు రైలులో వెళ్లి అక్కడి నుంచి గవర్నర్ రోడ్డులో భద్రాచలం చేరుకున్నారు. గూడెం రైల్వే స్టేషన్‌లో గవర్నర్‌కు పుష్పగుచ్ఛాలతో అధికారులు స్వాగతం పలికారు. తమిళిసై వెంట రాజ్‌భవన్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Read also: Sri Rama Pattabhishekam: నేడు భద్రాద్రిలో శ్రీరామ పట్టాభిషేకం.. పోటెత్తిన భక్తజనం

విశ్వమంతా ఆదర్శంగా కీర్తించే సీతారాముల వివాహ వేడుక గురువారం భద్రాచలంలో భక్తులకు ఆద్యంతం వీనుల విందుగా సాగింది. అశేష జనవాహినిలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. కాగా, ఈరోజు భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో శ్రీరాముడికి పుష్కర సామ్రాజ్య మహాపట్టాభిషేక కార్యక్రమం జరగనున్న సందర్భంగా.. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి వేడుక జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పుష్కర మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. భద్రాచలం లో జరుగుతున్న పట్టాభిషేక మహోత్సవానికి పోలీసులు దగ్గరుండి విజయనగరం జిల్లా నుంచి వచ్చిన అనాథలకు మిథిలా స్టేడియం ప్రవేశం కల్పించారు.. విజయనగరం జిల్లా నుంచి వాహన సౌకర్యం కల్పించి పట్టాభిషేక మహోత్సవం లో కూర్చోబెట్టారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పటిస్ట భద్రత ఏర్పాటు చేశారు.
Udayagiri Politics: ఉదయగిరిలో ఉద్రిక్త పరిస్థితులు.. రసవత్తరంగా రాజకీయాలు

Show comments