తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కు కరోనా సోకింది. లక్షణాలు కనిపించడంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణయింది. తనకు కరోనా సోకిందని వినోద్ కుమార్ తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని, కరోనా నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు చెప్పారు. ఇటీవల తనను కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని కరోనా నిబంధనలు పాటించాలని వినోద్ కుమార్ కోరారు. ఎలాంటి లక్షణాలు ఉన్న వెంటనే టెస్టులు చేయించుకుని జాగ్రత్త వహించాలని వినోద్‌కుమార్ సూచించారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌కు కరోనా
