NTV Telugu Site icon

వరంగల్ లో రెండు ఆసుపత్రులకు కొవిడ్‌ చికిత్స అనుమతులు రద్దు

వరంగల్ నగరంలోని కొవిడ్‌ చికిత్స అందిస్తున్న హన్మకొండలోని మ్యాక్స్‌కేర్‌, వరంగల్‌ ములుగు రోడ్డులోని లలిత ఆసుపత్రులపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం రెండు హాస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్స అనుమతులను రద్దు చేసింది. రెండు రోజుల కిందట అర్బన్‌లోని ఆరు ప్రైవేటు ఆసుపత్రులకు అధిక ఛార్జీల వసూలు, సౌకర్యాల లోపంపై వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి నేరుగా నోటీసులు జారీ చేసింది. అందులో పేర్కొన్న రెండు ఆసుపత్రులకు కొవిడ్‌ చికిత్స అనుమతిని రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది.