తెలంగాణలో జూన్ రెండో వారం నాటికి కరోనా కేసుల ఉధృతి పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 40 కేసులు నమోదవుతున్నాయి. వీటి సంఖ్య జూన్ రెండో వారం నాటికి రోజుకు 2,500 నుంచి 3వేల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఈ దశను ఫోర్త్ వేవ్ అని కూడా భావించవచ్చని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు స్వల్పంగానే ఉంటాయన్నారు. ఫోర్త్ వేవ్ ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వారం రోజులుగా తెలంగాణలోనూ స్వల్పంగా కేసుల సంఖ్య పెరిగింది. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వైద్య శాఖ అధికారులు పేర్కొన్నారు. కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు మాస్కు ధరించాలని సూచించారు. ఇప్పటివరకు వ్యాక్సిన్‌లు వేయించుకోనివారు టీకాలు తీసుకోవాలని కోరారు.
Hyderabad: నేడు సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
