NTV Telugu Site icon

TS Congress Manifesto: 62 అంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టో.. ‘అభయ హస్తం’ హామీలు ఇవే..

Ts Congress Manifesto

Ts Congress Manifesto

TS Congress Manifesto: తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. శుక్రవారం గాంధీభవన్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభయహస్తం పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను విడుదల చేశారు. 42 పేజీల్లో… 62 ప్రధాన అంశాలతో కాంగ్రెస్ సాధారణ మేనిఫెస్టోను సిద్ధం చేసింది. ఇందులో భూమి, విద్యార్థులు, డీఎస్సీ, ఉద్యోగాల భర్తీ, పీఆర్సీ ప్రకటనతో పాటు జర్నలిస్టులకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…ఈ మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిదన్నారు. అన్ని వర్గాలకు మేలు జరిగేలా ఈ మేనిఫెస్టోను రూపొందించామని చెప్పారు. తెలంగాణ ప్రజలకు అవసరమైన అంశాలను ఇందులో పొందుపరిచినట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి అధికారంలోకి తీసుకురావాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు హామీలు అమలు చేస్తామని, మేనిఫెస్టోలో చెప్పిన వాటిని అమలు చేస్తామని స్పష్టం చేశారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ దళితులు, గిరిజనుల ప్రయోజనాల కోసమే మేనిఫెస్టో ఉందన్నారు. రాష్ట్ర ఆస్తులను ప్రజల మధ్య పంచాలని అన్నారు. పేదలకు హక్కులు కల్పించేందుకు పలు అంశాలను ప్రస్తావించిన ఆయన.. ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకెళ్లేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అభయ హస్తం మేనిఫెస్టోలోని హామీలు ఇవే:

* తెలంగాణ అమరుల కుటుంబ సభ్యులకు రూ. 25 వేల పింఛను. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
* ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి 250 గజాల ఇళ్ల స్థలం
* రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల పంట రుణమాఫీ
* రైతులకు రూ. 3 లక్షల వడ్డీలేని రుణాలు
* ‘ధరణి’ స్థానంలో ‘భూమాత’ పోర్టల్
* వార్షిక జాబ్ క్యాలెండర్ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీ
* ఆడపిల్లల పెళ్లికి రూ. లక్షతోపాటు 10 గ్రాముల బంగారం
* ఎస్సీ వర్గీకరణ అనంతరం కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్లు
* బీసీ కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు
* బీసీ సబ్ ప్లాన్. ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు
* సంచార జాతులకు విద్య, ఉద్యోగ అవకాశాలతోపాటు 5 శాతం రిజర్వేషన్లు
* పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సాయంతో కూడిన ‘బంగారు తల్లి పథకం’
* దివ్యాంగుల పింఛన్ రూ. 5,016కు పెంపు, ఉచిత ఆర్టీసీ ప్రయాణం
* వ్యవసాయానికి 24 ఉచిత విద్యుత్‌పై మరింత స్పష్టత
* సర్పంచుల ఖాతాల్లో పంచాయతీల అభివృద్ది నిధులు
* గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు
* మరణించిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ. 5 లక్షలు
* బడ్జెట్‌లో విద్యారంగం వాటా 15 శాతానికి పెంపు
* ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు
* ఆరు నెలల్లోపు మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ
* ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరించి మెరుగైన వైద్యం
* ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ పింఛన్ విధానం
* జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ. 5 వేల గౌరవ భృతి
* మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు రూ. 2 లక్షలు
* ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సాయం
Quinton de Kock: క్వింటన్‌ డికాక్‌ అరుదైన ఘనత.. గిల్‌క్రిస్ట్, ధోనీకి కూడా సాధ్యం కాలేదు!