Site icon NTV Telugu

ధరణి అనేదే సమస్యల పుట్ట : సీతక్క

ఇక్కడ భూమి ఒక్కరిది, రైతు బంధు ఒక్కరిది. భూ సమస్యల పరిష్కారం ఏమో కాని, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నరు. భూమి ఉన్నోళ్లకు రైతు బంధు వస్తలేదు. అర్హులకు పథకాలు అందడం లేదు అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ధరణి అనేదే సమస్యల పుట్ట అని చెప్పిన సీతక్క భూస్వాములకు ధరణిలో సమస్యలు లేవు. కొద్దీ మొత్తం భూమి ఉన్న రైతులకే ఈ సమస్యలు. వాళ్ళకి కావాల్సినవి సీక్రెట్ గా చేస్తరు. రైతులకు ఎంలేదు. దళిత బంధు లోను చిక్కుముళ్ళు.. వేసిన పైసలు కూడా రివర్స్ తీసుకుంటున్నరు.. చదువుకున్నోళ్లకు ఉద్యోగాలు ఇయ్యు అంటే బర్లు గోర్లు ఇస్తున్నవు.. చదువుకునోళ్ళకు ఇచ్చేది ఇదా అని అని ఆవిడ ప్రశ్నించారు. ఉద్యోగాల్లో పథకాల్లో రిజర్వేషన్లు ఇవ్వు అంటే, వైన్స్ లకు రిజర్వేషన్లు ఇస్తున్నవు. కష్టపడే వారికి చెందాల్సినవి వారికి చెందట్లేవు. మీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎంత రైతు బంధు వస్తుందో ముఖ్యమంత్రి చెప్పాలి అని అడిగారు. రైతు పంట పండించాల, ఆఫీస్ ల చుట్టూ తిరగాలా అని అడిగిన సీతక్క సమస్యల పరిష్కారానికి అందరం పోరాడాలి అని పేర్కొన్నారు.

Exit mobile version