Site icon NTV Telugu

Kishan Reddy: నిశబ్ద విప్లవం రానుంది.. బీజేపీకి యూత్ మద్దతు ఇస్తున్నారు..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: నిశబ్ద విప్లవం రానుందని.. యూత్ బీజేపీకి మద్దతు ఇస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ అభ్యర్థులకు మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. యూత్ బీజేపీకి మద్దతు ఇస్తున్నారని, నిశబ్ద విప్లవం రానుందని అన్నారు. బీఆర్ఎస్ పైన ప్రజలు తిరగ బడుతున్నారని అన్నారు. బీజేపీ ఇచ్చిన హామీలు నెరవెరుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ నష్టపోయింది… ప్రజల రక్తం తాగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గ్యారంటీ లు, ఫేక్, ఆచరణ సాధ్యం కానివని, ఓట్ల కోసం మాత్రమే ఇచ్చినవే అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏది చెప్పైన అధికారం లోకి రావలనేది వారి ఆలోచన అన్నారు. అందరికీ న్యాయం జరిగే విధంగా మా ఎన్నికల మేనిఫెస్టో ఉందన్నారు. అవినీతినీ ఉక్కుపాదంతో అణచి వేస్తామని అన్నారు.

చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ముందంజలో ఉంది. భారతదేశానికి వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని ప్రజలు నిశ్శబ్ద విప్లవంగా చూస్తున్నారు. గ్రామాల్లోకి ఎమ్మెల్యేలు, ప్రచార రథాలు రాకుండా ప్రజలు అడ్డుకునే పరిస్థితి నెలకొంది. దళిత సోదరులు, రుణమాఫీ, బీసీ సోదరులు, దళిత ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చలేదని ధీటుగా ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు పోలీసులంటే భయపడిన ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుందన్న నమ్మకంతో ముందుకు వస్తున్నారు. కొన్ని సర్వే సంస్థలు ఫేక్ లీకులు ఇస్తున్నా.. బీజేపీ అభ్యర్థులకు ఆదరణ తగ్గడం లేదు.

బీజేపీ మేనిఫెస్టోకు ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. బీసీ ముఖ్యమంత్రి హామీ తనను ఆకర్షించింది. యువత నరేంద్ర మోదీకి అండగా నిలుస్తోంది. భార్సా, కాంగ్రెస్ కుటుంబాలకు చెందిన వారు కూడా బీజేపీకి మద్దతిస్తున్నారు. చెప్పినదానికి కట్టుబడి ఉండే పార్టీ బీజేపీ అని అందరూ అనుకుంటున్నారు. ఇతర పార్టీల నేతల మాటలు కోట దాటినా, చేసేది ప్రగతి భవన్, గాంధీభవన్ దాటి వెళ్లడం లేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది. ఆ పార్టీ ఈ దేశ, రాష్ట్ర ప్రజలకు విషాదాన్ని మిగిల్చింది. కాంగ్రెస్ వల్లనే తెలంగాణ అనేక రకాలుగా వెనుకబడిందన్నారు. ఉద్యమంలో మొదటి దశలో 365 మంది, మూడో దశలో 1200 మంది విద్యార్థులు చనిపోయారు. ప్రస్తుతం ఆ పార్టీ ఇస్తున్న బూటకపు హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని కిషన్ రెడ్డి అన్నారు.
CM KCR: మానకొండూర్ సభకు కేసీఆర్‌.. సీఎం బస్సును చెక్ చేసిన అధికారులు

Exit mobile version