NTV Telugu Site icon

Congress First List: కాంగ్రెస్ టిక్కెట్టు దక్కించుకున్న వలస నేతలు వీరే..

Congress 12 New Mummbres

Congress 12 New Mummbres

Congress First List: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన 12 మంది నేతలకు టిక్కెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది. టికెట్ల కేటాయింపులో భాగంగా వలస నేతలకే టికెట్లు కేటాయించాల్సి వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలను పక్కన పెట్టి వలస నేతలకు టిక్కెట్లు కేటాయించడం చర్చకు దారితీసింది. వలస నేతల వల్ల సీనియర్లకు కూడా టిక్కెట్లు దక్కలేదు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుంచి సమైక్య రాష్ట్రంలో టీడీపీ అభ్యర్థిగా వరుస విజయాలు సాధిస్తున్న నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపింది. ఇటీవల పార్టీలో చేరిన కూచుకుళ్ల రాజేష్‌రెడ్డికి పార్టీ టికెట్‌ కేటాయించింది. టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ మూడు రోజుల క్రితం గాంధీభవన్‌లో నాగం జనార్థన్ రెడ్డి తన అనుచరులతో ఆందోళన నిర్వహించారు. తమకు టికెట్ రాదనే సంకేతాలు అందడంతో నాగం జనార్థన్ రెడ్డి, ఆయన అనుచరులు గాంధీభవన్ వద్ద నిరసనకు దిగారు. ఈ ఆందోళన అనంతరం అనుచరులతో నాగం జనార్దన్ రెడ్డి, ఆయన కుమారుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సనత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి మర్రి ఆదిత్య రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. తన తండ్రి మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరినప్పటికీ ఆదిత్యరెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే మర్రి ఆదిత్య రెడ్డికి బదులుగా కోట నీలిమకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది.

ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ స్థానాల నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వినయ్ కుమార్ రెడ్డి, సునీల్ కుమార్ లకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు కేటాయించింది. మెదక్, మల్కాజిగిరి స్థానాల నుంచి మైనంపల్లి రోహిత్, మైనంపల్లి హన్మంతరావులకు టిక్కెట్లు దక్కాయి. బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కింది. చంద్రశేఖర్ జహీరాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. గద్వాల జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య ఇటీవల బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. గద్వాల్‌లో కాంగ్రెస్‌ నుంచి సరితా తిరుపతయ్యకు టికెట్‌ లభించింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవలే పార్టీలో చేరారు. కల్వకుర్తి అసెంబ్లీ సీటును కాంగ్రెస్ పార్టీ ఆయనకు కేటాయించింది. గతంలో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి గెలిచిన సంగతి తెలిసిందే. నకిరేకల్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున వేముల వీరేష్‌ విజయం సాధించారు. 2014లో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా వేముల వీరేశం గెలుపొందారు. 2018లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్న చిరుమూర్తి లింగయ్యకు వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కింది. మరోవైపు నిర్మల్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన శ్రీహరిరావుకు టికెట్ దక్కింది.

కాంగ్రెస్‌ వలస నేతలు వీరే..

1. ఆర్మూర్- వినయ్ కుమార్ రెడ్డి
2. బాల్కొండ – సునీల్
3.మెదక్- మైనంపల్లి రోహిత్
4. జహీరాబాద్- చంద్రశేఖర్
5. మల్కాజిగిరి- మైనంపల్లి హన్మంత రావు
6. సనత్ నగర్- కోట నీలిమ
7. గద్వాల – సరిత తిరుపతయ్య
8. నాగర్ కర్నూల్- కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
9. కల్వకుర్తి- కసిరెడ్డి నారాయణ రెడ్డి
10.కొల్లాపూర్- జూపల్లి కృష్ణారావు
11.నకిరేకల్ – వేముల వీరేశం
12. నిర్మల్-శ్రీహరి రావు

Nirmala Sitharaman: సుస్థిర అభివృద్ధికి చేయూతనివ్వండి.. ప్రైవేట్ రంగానికి మంత్రి నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి