Munugode bypoll: మునుగోడులో ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. పోటాపోటీగా ప్రచారాలు, ప్రచారజోరులో విమర్శల హోరు జరుగుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్ల కూడా జరుగుతన్నాయి. హోరా హోరీగా జరుగుతున్న ఉప ఎన్నికలకు గెలుపే లక్ష్యంగా ప్రచారాలు కొనసాగుతున్నాయి.
అయితే కర్ణాటక తరహాలో చండూరులో పోస్టర్లు వెలిశాయి. కర్ణాటకలో September 23, 2022 ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని లక్ష్యంగా చేసుకుని ‘పేసీఎం’ అంటూ వెలసిన పోస్టర్లు వెలిశాయి. కర్ణాటక ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ’40 శాతం కమీషన్ సర్కార్’ పేరుతో పేసీఎం పోస్టర్లను కాంగ్రెస్ ప్రచురించింది. సీఎం బసవరాజ్ బొమ్మై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఉన్న ఈ ఫోటోలు గోడలపై కన్పించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే చండూరుకు కర్ణాటక గాలి సోకింది. చండూరులో వెలిసిన పోస్టర్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. చండూరులో రాత్రికి రాత్రి Phone Pay తరహాలో Contract Pe, 18000 కోట్లు transaction కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికు కేటాయించడం జరిగిందని వేల సంఖ్యలో షాపులకు, గోడలకు వెలశాయి. పేసీఎం తరహా Contract Pe అంటూ వెళిసిన పోస్టర్లు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. గత కొంతకాలంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడు పోయాడని విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరాడని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై రాజగోపాల్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. మరి ఈ పోస్టర్లపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Read also: Vladimir Putin: ఉక్రెయిన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్.. బేఖాతరు చేస్తే దబిడిదిబిడే
నిన్న నల్లగొండ జిల్లా మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్ లలో బీజేపీ పార్టీ బలం పెరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల విశ్వాసం కోల్పోయిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. 12 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే పార్టీ మారారో అప్పుడే ప్రజల విశ్వాసం కోల్పోయిందని సంచళన వ్యాఖ్యాలు చేశారు. ప్రజలు మోడీ వైపు, బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. అవినీతిత పాలన కుటుంబ పాలన పోవాలంటే ఇది బీజేపీతోనే సాధ్యమని ఇప్పుడు మునుగోడు ఎన్నిక రావడం జరిగిందని అన్నారు. ఇది ఒక వ్యక్తికోసమో, ఎమ్మెల్యే పదివి కోసమో వచ్చిన ఎన్నిక కాదుని అన్నారు. మునుగోడులో వచ్చే తీర్పుతోనే తెలంగాణలో మార్పు వస్తుందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. తప్పకుండా ఈ ధర్మయుద్ధంలో మునుగోడు ప్రజలు ధర్మం వైపు వుంటారని, ఒక చరిత్రలో మిగిలిపోయే తీర్పు ఇస్తారని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
Vladimir Putin: ఉక్రెయిన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్.. బేఖాతరు చేస్తే దబిడిదిబిడే