Common Mobility Card: త్వరలో కామన్ మొబిలిటీ కార్డ్.. ముందుగా మెట్రోలో అందుబాటులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Common Mobility Card: మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతోంది. ఇది ప్రజల జీవితాన్ని సులభతరం చేయడానికి చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం త్వరలో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌ను ప్రారంభించనుంది. హైదరాబాద్ నగర ప్రజా రవాణా వ్యవస్థలో ఇది ఒక పెద్ద ముందడుగు కానుంది. మెట్రో రైలు, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించేందుకు వీలుగా ఈ కార్డును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలో మీరు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ద్వారా షాపింగ్ చేయడానికి ఉపయోగించే బ్యాంక్ కార్డ్‌తో మెట్రో రైలులో ప్రయాణించగలరు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ కంపెనీ పూర్తి చేయనుంది. స్టేషన్లలో ఇప్పటికే కార్డ్ రీడర్లను ఏర్పాటు చేశారు. ఈ కార్డులు అందుబాటులోకి వచ్చాక ముందుగా.. మెట్రో, ఆ తర్వాత ఆర్టీసీ బస్సులు, క్యాబ్‌లు, ఎంఎంటీఎస్, పార్కింగ్ తదితర వాటిని వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా.. షాపింగ్, ఆన్లైన్ లావాదేవీలకు బ్యాంక్ కార్డ్ ఉపయోగపడుతుంది.
Read also: ED Notices: రేపు విచారణకు రావాలి.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
NCMC కార్డ్ ఇప్పటికే ఉన్న మెట్రో స్మార్ట్ కార్డ్ లాగా పనిచేస్తుంది. మెట్రో స్మార్ట్ కార్డ్ మెట్రోలో మాత్రమే చెల్లుతుంది. NCMC కార్డ్ అన్ని ప్రయాణాలకు చెల్లుబాటు అవుతుంది. షాపింగ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. రూ.100 నుంచి రూ.2 వేల వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. మెట్రో స్టేషన్లలో ఎక్కడైనా ఆన్లైన్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కార్డులను NCMC అందించే బ్యాంకుల నుండి కూడా పొందవచ్చు. బ్యాంకులు వీటిని రూపే కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డులుగా అందిస్తున్నాయి. SBI, ICICI, ఇండియన్ బ్యాంక్ మరియు Paytm వాలెట్ కంపెనీలు వంటి బ్యాంకులు దేశవ్యాప్తంగా వివిధ మెట్రోలలో NCMC కార్డులను అందిస్తున్నాయి. Paytm త్వరలో హైదరాబాద్ మెట్రోలో వాలెట్ ట్రాన్సిట్ కార్డ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. కార్డు కోసం రూ.250 చెల్లించాలి. కార్డు ఖరీదు రూ.150 కాగా నగదు రూపంలో రూ.100. తెలంగాణ ప్రభుత్వం ముందుగా హైదరాబాద్ మెట్రో వరకు ప్రయోగాత్మకంగా ఈ కార్డును జారీ చేయనుందని, త్వరలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు చర్యలు తీసుకోనుంది.
Polala Amavasya: శ్రావణ మాసానికి వీడ్కోలు.. ఆదివాసీ గూడెల్లో కాడెద్దుల వేడుకలు
తాజావార్తలు
-
Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు “బ్రాండెడ్ విషం” తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!